సల్మాన్ ను హగ్ చేసుకున్నానని రజనీకాంత్ కోపడ్డారు: రంభ

January 5, 2024

సల్మాన్ ను హగ్ చేసుకున్నానని రజనీకాంత్ కోపడ్డారు: రంభ

తెలుగు సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో సీనియర్ నటి రంభ ఒకరు. ఈమె ఆ ఒకటి అడుక్కు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా హిందీ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి రంభ అనంతరం ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా విదేశాలలో స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యారు ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతూ ఉన్నటువంటి రంభ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా తిరిగి ఇండస్ట్రీలోకి వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రంభ సైతం రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సీనియర్ హీరోలు అయినటువంటి రజనీకాంత్ అలాగే సల్మాన్ ఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. తాను రజనీకాంత్ గారితో కలిసి అరుణాచలం సినిమాలో నటించానని తెలిపారు. అదే సమయంలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి బంధన్ సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపారు.

అయితే ఈ రెండు సినిమా షూటింగ్స్ పక్కపక్కనే కావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం షూటింగ్ మధ్యాహ్నం నుంచి నైట్ వరకు సల్మాన్ సినిమా పనులలో బిజీగా ఉండే దానిని అయితే ఒకరోజు అరుణాచలం షూటింగ్ లొకేషన్లోకి సల్మాన్ ఖాన్ గారు వచ్చారు అతనిని చూడగానే నేను వెంటనే వెళ్లి హగ్ చేసుకున్నాను అది చూసినటువంటి రజనీకాంత్ డైరెక్టర్ కి ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత నేను అక్కడికి రావడంతో ఆయన టవల్ విసిరి కొట్టి నాతో చాలా సీరియస్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది మేడం అని చెప్పడంతో నేను ఏడ్చేశానని అప్పుడు రజనీకాంత్ వచ్చి ఎవరి ఈ అమ్మాయిని ఏడిపించింది అంటూ ప్రశ్నించారు. బాలీవుడ్ హీరోలు కనబడితే హగ్ చేసుకుంటారు మాకైతే షేక్ హ్యాండ్ ఇస్తారు.ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ సరదాగా నన్ను ఆట పట్టించడంలోనే ఏడిపించారు అంటూ రంభ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మా అంజి గాడు ప్రాణం అంటున్న మిర్న మీనన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

ట్రెండింగ్ వార్తలు