సల్మాన్ ఖాన్ అభిమానులపై లాఠీ రీచార్జ్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

April 12, 2024

సల్మాన్ ఖాన్ అభిమానులపై లాఠీ రీచార్జ్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు సల్మాన్ ఖాన్. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు బుల్లితెరపై రియాల్టీ షోలతో సందడి చేస్తుంటారు. కాగా ఈయన గత ఏడాది కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. ఈ చిత్రంలో షహనాజ్ గిల్ , పూజా హెగ్డే, వెంకటేష్ కీలక పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన పోలీసు లాఠీఛార్జ్ వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలేం జరిగింది.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు అన్న విషయాల్లోకి వెళితే.. తాజాగా రంజాన్ పండగ సందర్భంగా తమ అభిమాన తారలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. కానీ కొందరు నేరుగా తమ అభిమాన హీరోలను కలిసేందుకు ఇంటికి వెళ్లారు. అటు షారుఖ్ ఖాన్ ఇంటివద్ద కూడా భారీ సంఖ్యలో జనాలు చేరుకున్నారు.

అలాగే సల్మాన్‌ ఖాన్‌ కు ఈద్‌ శుభాకాంక్షలు తెలిపేందుకు జనాలు ఆయన ఇంటి ముందుకు చేరుకున్నారు. కానీ జనం హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. లాఠీ ఛార్జీ చేసి జనాలను చెదరగొట్టారు పోలీసులు. ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ముందు జనం గుమి గూడారు. ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ ఈద్, తన పుట్టిన రోజున తన అభిమానులను కలుస్తాడు. సల్మాన్‌ ఖాన్‌ను చూసేందుకు అతని ఇంటి బయట జనాలు భారీగా చేరుకుంటారు. కానీ ఈసారి అభిమానుల తాకిడి పెరిగిపోయింది. కొంత సమయం తర్వాత పరిస్తితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://telugu.chitraseema.org/premalu-movie-streaming-in-ott%E0%B0%93%E0%B0%9F%E0%B1%80%E0%B0%9F%E0%B1%80%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA/

ట్రెండింగ్ వార్తలు