సల్మాన్ నటించిన ఆ సినిమాకి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారా? అసలు విషయం ఇదే!

February 17, 2024

సల్మాన్ నటించిన ఆ సినిమాకి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారా? అసలు విషయం ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. కానీ ఆ సినిమాకు ముందే మెగాస్టార్ ఫ్యామిలీకి బాలీవుడ్ స్టార్స్ తో కనెక్షన్లు బానే ఉన్నాయి. రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం గ్లోబల్ నటి ప్రియాంక చోప్రాతో ఓ సినిమాలో నటించి బాలీవుడ్లో డెబ్యూట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని తుఫాను అనే పేరుతో తెలుగులో విడుదల చేశారు.

కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ఇంక బాలీవుడ్ సినిమాల వైపు వెళ్లలేదు రామ్ చరణ్. చాలా సంవత్సరాల తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కి భాయ్ కీసీ కి జాన్ అనే సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించి, ఒక పాటకి డాన్స్ కూడా వేశారు. మెగాస్టార్ హీరోగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో అలరించారు. అయితే వీళ్ళ మధ్య బంధం చాలా సంవత్సరాల కిందటే ఏర్పడింది.

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగులో ప్రేమ లీల అనే పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో సల్మాన్ కి తెలుగు డబ్బింగ్ చెప్పింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఈ విషయం ఎక్కువ మందికి తెలియలేదు.

సల్మాన్ ఖాన్ నటించిన ద్విపాత్రాభినయంలో రెండు రోల్స్ కి రామ్ చరణే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించనున్నారు అనే వార్తలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సి ఉంది.

Read More: మహేష్-రాజమౌళి సినిమా టైటిల్ ఫిక్స్ చేసేసారా?

ట్రెండింగ్ వార్తలు