మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

March 11, 2024

మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కుటుంబంలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో రామ్ చరణ్ ఒకరు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక రాంచరణ్ ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకొని భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. ఈయనకు సినిమాలతో పాటు నిర్మాణ సంస్థ అలాగే ఇతర బిజినెస్లలో కూడా పెట్టుబడులను పెట్టారు. ఈయన మాత్రమే కాకుండా ఈయన భార్య ఉపాసన కూడా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకోవడమే కాకుండా ఇతరత వ్యాపారాలను కూడా ప్రారంభించారు.

ఇలా ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఉపాసన భారీ స్థాయిలోనే లాభాలను అందుకుంటున్నారు. ఇక ఈ లాభాలలో ఈమె కొంత మొత్తంలో సామాజిక సేవ చేయడానికి ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక వ్యక్తిగా మంచి మనసున్న మనిషిగా ఉపాసన ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా భారీ స్థాయిలో బిజినెస్లను నడుపుతున్నటువంటి ఈమె సంపాదన ఎంత ఉంటుందన్న అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. అయితే ఇటీవల పలు నివేదికల ప్రకారం ఉపాసన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు విలువ సుమారు 1130 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇది కేవలం ఉపాసన సంపాదించిన ఆస్తులని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్ గా ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Read More : అయాన్ ను అప్పుడే సిద్ధం చేస్తున్న బన్నీ.. మామూలు ప్లాన్ కాదుగా?

ట్రెండింగ్ వార్తలు