July 5, 2022
ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న టాప్ గ్రాస్ కలెక్షన్స్ లిస్ట్ అంతా బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతోనే నిండిపోయింది. దీంతో బాలీవుడ్ బడా హీరోలు, దర్శక– నిర్మాతలు ఈ లిస్ట్‌లో తిరిగి హిందీ సినిమాలను చేర్చాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. ఇందులో భాగంగానే ఫస్ట్‌టైమ్ ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్‌లు కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ అనే సినిమా తీశారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్ కాస్త వెనక్కి తగ్గినట్లయింది.
ఇప్పుడు మళ్లీ మరో మల్టీస్టారర్ ఫిల్మ్ తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌లు కలిసి ఓ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ ఫిల్మ్ చేయబోతున్నారట. ఈ సినిమాను ఆదిత్య చోప్రా తీస్తారట. బీటౌన్ సర్కిల్స్‌లో ఇప్పుడు వినిపిస్తున్న నయా కబుర్ ఇదే మరి. అసలు సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ బాలీవుడ్ గాసిప్ రాయుళ్లు మాత్రం అప్పుడే ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే టైటిల్ కూడా పెట్టేశారు మరి. అయితే 1995లో వచ్చిన ‘కరణ్ అర్జుణ్’ తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్‌ఖాన్ కలిసి ఫుల్‌లెంగ్త్ రోల్స్‌లో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరి..బాలీవుడ్ బాక్సాఫీస్‌పై ఉన్న సౌత్ రికార్డ్స్‌ను తిరగరాయడానికైనా వీరద్దరు కలిసి నటిస్తారా? వెయిట్ అండ్ సీ.
మరోవైపు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్‌ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. అలాగే షారుక్‌ఖాన్ చేసిన ‘జవాన్’ చిత్రంలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్‌చేశారు. ఇక ‘టైగర్ 3’ వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుండగా, ‘పఠాన్’ మాత్రం వచ్చే జనవరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.