కొత్త మెరుపులతో మళ్లీ వస్తున్న స్టార్ హీరోయిన్లు.. క్రేజీ కాంబినేషన్లలో సమంత, పూజ హెగ్డే!

April 4, 2024

కొత్త మెరుపులతో మళ్లీ వస్తున్న స్టార్ హీరోయిన్లు.. క్రేజీ కాంబినేషన్లలో సమంత, పూజ హెగ్డే!

సమంత, పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేని స్టార్ హీరోయిన్లు. ఒకప్పుడు వీరిద్దరూటాలీవుడ్ ని వరుస పెట్టి దున్నేశారు. అప్పట్లో ఏ సినిమా చూసిన ఈ హీరోయిన్ లే కనిపించేవారు. అయితే టాలీవుడ్ లో క్రమంగా వీరి హవా తగ్గిందనే చెప్పాలి. క్రమంగా తెర మరగవుతున్న సమయంలో మళ్లీ కొత్త మెరుపులతో, క్రేజీ కాంబినేషన్లతో మన ముందుకి వస్తున్నారు ఈ హీరోయిన్స్. ముందుగా సమంత సంగతి తీసుకుంటే ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సమంత నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో ఈమెకి ఫ్యాన్స్ ఉండటం ఈమెకి ప్లస్ అయింది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తెరి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది.

ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తన రీయంట్రీ ఈ కాంబినేషన్ లో అయితేనే బాగుంటుందని భావించిందేమో సమంత. అయితే ఈ సినిమా గురించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు నాడు అనౌన్స్ చేస్తారు. ఇక మరొక హీరోయిన్ పూజ హెగ్డే కూడా తన రీ యంట్రిని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం.

నాగవల్లి ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే 2014లో నాగచైతన్య తో కలిసి ఒక లైలా కోసం అనే సినిమాలో కలిసి నటించింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమాలు హిట్ అయితే కనుక మళ్ళీ ఈ స్టార్ హీరోయిన్లు తమ హవా కొనసాగిస్తారు అనటంలో ఎలాంటి అనుమానం లేదు.

Read More: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “అదృశ్యం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ట్రెండింగ్ వార్తలు