సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “అదృశ్యం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

April 4, 2024

సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “అదృశ్యం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

2022 లో విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇని ఉత్తరమ్. ఆకాశమే నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో హీరోయిన్ తన అద్భుతమైన నటనతో అందర్నీ మెప్పించింది. ఆకాశమే నీ హద్దురా సినిమాలో కూడా ఈమె తన నటన తో మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఇని ఉత్తరమ్ సినిమా తెలుగులో అదృశ్యం పేరుతో డైరెక్ట్ అండ్ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అలా రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి కూడా. ఆ క్రమంలోనే గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీ లో అదృశ్యం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకపోవడం గమనార్హం.

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళితోపాటు హరీష్ ఉత్తమన్, సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. సుదీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి షీషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. సోషల్ మెసేజ్ కి క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. కథలోని ట్విస్టులు టర్న్ లు ఆడియన్స్ ని అలరించాయి. అశ్విన్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, జానకి ఇద్దరు ప్రేమించుకుంటారు.

త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇంతలోనే తన ఫ్రెండ్ ని హత్య చేశానంటూ జానకి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. నిజంగానే ఆమె హత్య చేసిందా.. లేదంటే ఈ కేసులో ఆమెను ఎవరైనా ఇరికించారా.. ఒక ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న స్ట్రైక్ ని అన్యాయంగా హోమ్ మినిస్టర్ ఆపాలని ఎందుకు అనుకున్నారు? జానకి హత్యకు, హోం మినిస్టర్ కుట్రలకు ఏమైనా సంబంధం ఉందా అన్నదే ఈ సినిమా కథ.

Read More: గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబి!

ట్రెండింగ్ వార్తలు