రష్మిక, పూజ హెగ్డే ల వారసురాలు శ్రీ లీల.. ఏ విషయంలో అంటే!

February 23, 2024

రష్మిక, పూజ హెగ్డే ల వారసురాలు శ్రీ లీల.. ఏ విషయంలో అంటే!

నేటి జనరేషన్ లో చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్న నటిగా శ్రీ లీల గురించి చెప్పుకోవచ్చు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఈమె కేవలం యాక్టర్ మాత్రమే కాకుండా డాక్టర్ మరియు డాన్సర్ కూడా. 2019లో కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ధమాకా సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అవకాశం వచ్చిన ప్రతి సినిమాకి ఓకే చెప్తూ కొన్నిసార్లు సక్సెస్ అయితే మరికొన్నిసార్లు డిజాస్టర్ అయింది. కేవలం నాలుగు సంవత్సరాలలో 12కి పైగా చిత్రాలు చేసేసింది ఈ భామ.రీసెంట్ గా నటించిన గుంటూరు కారం సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ఎలాంటి కామెంట్లు వచ్చాయో కూడా మనం చూసాము.

ఇదే క్రమంలో శ్రీ లీల కు సంబంధించిన మరొక వార్త కూడా వైరల్ అవుతుంది. గతంలో పూజ హెగ్డే, హీరోయిన్ రష్మిక మందన్న ఎలా అయితే కెరీర్ ని ప్లాన్ చేసుకున్నారో ఇప్పుడు శ్రీలీల కూడా అదే దారిలో ముందుకు వెళుతుంది. ఇంతకీ రష్మిక, పూజ ఏం చేశారంటే ముందుగా తెలుగులో సూపర్ హిట్ లు కొట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. తరువాత కెరియర్ ఫాల్డౌన్ అవుతున్న సమయంలో తమిళ్, హిందీ వంటి భాషలలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు.

ఇప్పుడు శ్రీ లీల కూడా అదే పని చేస్తుంది. తెలుగులో ఇన్నాళ్లు దుమ్ము దులిపిన ఈ పిల్ల ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందంట. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. వాటి వివరాలను మేకర్స్ తో మాట్లాడిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

Read More: దేవర సినిమాపై జాన్వీ కపూర్ వైరల్ కామెంట్స్.. మూవీ పై మరిన్ని అంచనాలు!

ట్రెండింగ్ వార్తలు