January 18, 2024
2019 వచ్చిన కిస్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైనప్పటికీ తెలుగులో వచ్చిన పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. ఆ తర్వాత రవితేజ ధమాక సినిమాలో తన డ్యాన్స్‌లతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. దాంతో ఒకే సారి ఏకంగా పదికిపైగా సినిమాలు సైన్ చేసి టాలీవుడ్‌లోనే మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ అయ్యింది.
గతేడాది భగవంత్ కేసరితో హిట్ సొంతం చేసుకున్నప్పటికీ..రామ్ పోతినేని స్కంద, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీల గుంటూరు కారంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెరీర్ లో మొదటిసారి మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఇక్కడ కూడా ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. గుంటూరు కారం లో ఆమెను ముందుగా సెకండ్ లీడ్ గా తీసుకున్నారు. ఇక పూజ హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ అయిపోయింది.
గుంటూరు కారం తన కెరీర్ కి గట్టి పునాది వేస్తుందని భావించింది. కానీ..గుంటూరుకారం అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ‘గుంటూరు కారం’లో ‘కుర్చీ మడతపెట్టి…’ సాంగ్ విడుదలకు ముందు విపరీతంగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. మహేష్ మాస్ స్టెప్స్ గురించి డిస్కషన్ నడిచింది. సినిమా విడుదలైన తర్వాత ఆ పాటలో శ్రీ లీల డ్యాన్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
మిర్చి యార్డు గోడౌన్‌లో ‘చెప్పవే చిరుగాలి…’ పాటకు శ్రీ లీల డ్యాన్స్ వేసిన తర్వాత ‘ప్రభుదేవాకు డూప్‌లా ఉంది’ అని మహేష్ బాబు అంటారు. ఆ తర్వాత ‘నక్కిలీసు గొలుసు…’ పాటకు కూడా శ్రీ లీల అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అయితే ఎప్పటిలాగే ఆమె పాత్ర డ్యాన్సులకే పరిమితమైందని పెదవి విరుస్తున్నారు కొందరు సినీ ప్రేమికులు.
ఈ నేపథ్యంలో శ్రీ లీలను పూజ హెగ్డే తో పోలుస్తున్నారు విమర్శకులు. పూజా హెగ్డే కూడా ఇంతే .. డీజే సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది. కేవలం హీరోలని చూసి సినిమాలకు సైన్ చేసింది. ముందు బాగానే ఉన్నా ఆచార్య, రాధే శ్యాం లాంటి డిజాస్టర్స్ తర్వాత పూజకి ఆఫర్లు కరువయ్యాయి. ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే తప్పు రిపీట్ చేస్తుందని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం స్టార్ హీరోల సినిమాలపైనే కాదు పాత్రపైన దృష్టి పెట్టాల్సిందిగా కొందరు నెటిజన్లు సలహాలిస్తున్నారు..ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భీష్మ’ తర్వాత నితిన్ & వెంకీ కుడుముల చేస్తున్న సినిమాలు శ్రీ లీల చేతిలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
Read More: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న ఇలియాన..ఆ హీరోయిన్ కలిసి సందడి