SamanthaRuthPrabhu: స‌మ‌స్య‌లు ఏక‌కాలంలో చుట్టుముట్టాయి

November 9, 2023

SamanthaRuthPrabhu: స‌మ‌స్య‌లు ఏక‌కాలంలో చుట్టుముట్టాయి

త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాన‌ని ఖుషి(Kushi) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌క‌టించిన స‌మంత (SamanthaRuthPrabhu) ఆ త‌ర్వాత సినిమాల‌కు కాస్త విరామం ప్ర‌క‌టించి ప్ర‌స్తుతం త‌న పూర్తి స‌మ‌యాన్ని ఆరోగ్యానికే కేటాయించింది…దానిలో భాగంగానే ఐస్ బాత్‌, హాట్ బాత్ అంటూ అన్ని ర‌కాల ఆరోగ్య సూత్రాల‌ని పాటిస్తోంది. అప్పుడ‌ప్పుడు ఫోటో షూట్‌లు, ఈవెంట్‌ల‌కు హాజ‌ర‌వుతూ హాట్ ఫోజుల‌తో ఫాలోయింగ్ త‌గ్గ‌కుండా చూసుకుంటుంది.

తాజాగా స‌మంత ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో(Samantha Interview)మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న బాధల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు వెల్ల‌డించింది. ఎన్న‌డూ లేని విధంగా త‌న‌ని ఒకే సారి మూడు స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయ‌ని వాటినుండి బ‌య‌ట‌ప‌డ‌డం కోసం త‌ను ఏం చేసిందో వివ‌రంగా చెప్పుకొచ్చింది.

”ఒక వైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు (య‌శోద‌(Yashoda),శాకుంత‌లం(Shakumthalam) కూడా ప్రేక్షకాదరణ లభించ లేదు ఇలా మూడు స‌మ‌స్య‌లు ఏక‌కాలంలో త‌న‌ని చుట్టుముట్టాయిని చెప్పుకొచ్చింది. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది’’ అని తెలిపింది స‌మంత‌

ఇక ఇంతమందిలో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని..ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అందమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’’ అని సమంత తెలిపింది.

Read MoreMrunal Thakur: క్యూట్ లుక్స్‌తో మైమరిపిస్తోన్న మృణాల్‌

ట్రెండింగ్ వార్తలు