మళ్లీ మొదలు పెట్టిన సమంత..ఇక త్వరలోనే శుభవార్త!

December 24, 2023

మళ్లీ మొదలు పెట్టిన సమంత..ఇక త్వరలోనే శుభవార్త!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి మనందరికీ తెలిసిందే. సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధి చికిత్స నిమిత్తం విదేశాలలో ఉంటోంది. ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఆమె దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుపుతూ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ వస్తోంది.

తాజాగా కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో(Samantha Instagram Story) ఈ విధంగా రాసుకొచ్చింది. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సామ్. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. మళ్లీ తాను సినిమాలు మొదలుపెట్టబోతున్నట్లుగా రాసుకొచ్చింది సమంత. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈస్ బ్యాక్ అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.

Samantha Instagram Story:https://www.instagram.com/samantharuthprabhuoffl?utm_source=ig_web_button_share_sheet&igsh=OGQ5ZDc2ODk2ZA==Read MoreGame Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు