నా నిర్ణయాల వెనుక ఉన్నది ఆమె..వైరల్ అవుతున్న సమంత పోస్ట్!

February 19, 2024

నా నిర్ణయాల వెనుక ఉన్నది ఆమె..వైరల్ అవుతున్న సమంత పోస్ట్!

సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్తా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే సమంత ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులను చేసే సమంతా ఇటీవల మలేషియా వెళ్లారని తెలుస్తోంది. అయితే అక్కడ తన స్నేహితురాలితో కలిసి దిగినటువంటి ఫోటోను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

మలేషియాలో ఉన్నటువంటి తన స్నేహితురాలు మేఘన అనే అమ్మాయిని సమంత కలిసారు. ఈ క్రమంలోనే తనతో కలిసి దిగినటువంటి ఫోటోని ఈమె షేర్ చేస్తూ ఇప్పటివరకు నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ నిర్ణయాలకు ఫేస్ కనుక పెడితే అది మేఘన అంటూ ఈమె తాను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక మేఘన సలహాలు సూచనలు ఉన్నాయని చెప్పుకు వచ్చారు..

ఈ విధంగా సమంత తన నిర్ణయాలు వెనుక ఉన్నది తన స్నేహితురాలు అనే విషయాన్ని తెలియచేయడంతో పలువురు ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తూ మీరు నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిపోవడం వెనుక కూడా ఈమె ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. MS గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్‌లో పాల్గొన్న సామ్‌, అంతకు ముందు చేసిన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. రెడ్‌ కలర్‌ శారీలో, అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read More: ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడానికి ఆ అవమానమే కారణమా.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు