నా జీవితంలో అది కఠిన నిర్ణయం.. ఇకపై సమస్య ఉండదు: సమంత

March 10, 2024

నా జీవితంలో అది కఠిన నిర్ణయం.. ఇకపై సమస్య ఉండదు: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలి అంటే అది సాహసమే అని చెప్పాలి.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలోను అలాగే వెబ్ సిరీస్ లలో అవకాశాలను అందుకుంటు ఉన్నటువంటి ఈమెకు అనారోగ్యం చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో ఏడాది పాటు విరామం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె ఖుషి సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు.

మయో సైటిసిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం వివిధ దేశాలకు వెళుతూ ఈమె ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత ఈ వ్యాధి నుంచి క్షేమంగా బయటపడ్డారని తెలుస్తుంది. ఈ విధంగా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నటువంటి సమంతా త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి దూరం అవ్వడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను ఇండస్ట్రీకి విరామం ప్రకటించాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కఠినమైనదని ఈమె తెలిపారు. అయినా తప్పలేదని నాకు కెరియర్ కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని సమంత తెలిపారు. అయితే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని తాను అనుకుంటున్నానని ఈమె తెలిపారు. ఇక ఏడాది పాటు నేను నా సమయం వృధా చేయడం కోసం ఇండస్ట్రీకి విరామం ఇవ్వలేదని నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని తెలియజేశారు. ఇకపై ఇలాంటి సమస్యలు తన దరికి చేరవని భావిస్తున్నాను అంటూ సమంత ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More : లూసిఫర్ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన మంజు మ్మేల్ బాయ్స్!

ట్రెండింగ్ వార్తలు