సమంత ఫస్ట్ లవ్ చైతు కాదా.. రెండేళ్లు వెంటపడి విసిగించారా.. ఫస్ట్ లవ్ బయట పెట్టిన సామ్ !

March 2, 2024

సమంత ఫస్ట్ లవ్ చైతు కాదా.. రెండేళ్లు వెంటపడి విసిగించారా.. ఫస్ట్ లవ్ బయట పెట్టిన సామ్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దన్నర కాలమవుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈమె ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చారు. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తరుణంలో కొంత సమయం ఇండస్ట్రీకి విరామం ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

ఇలా సినిమాలకు సమంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు. అయితే తాజాగా ఈమె తన ఫస్ట్ లవ్ గురించి అసలు విషయం బయట పెట్టారు. సమంత నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి అయినటువంటి మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమంత మొదటి లవ్ చైతన్య కాకుండా మరెవరు అనే విషయానికి వస్తే.. సమంత చదువుకునే రోజుల్లో పల్లవరం నుండి టీనగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట. ఒక అబ్బాయి రోజూ సమంత కోసం బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసేవాడట.

ఇలా ప్రతిరోజు ఆ అబ్బాయి తన కాలేజీ వరకు తనని ఫాలో అవుతూ ఉండేవారని రెండు సంవత్సరాలు పాటు ఇలా నా వెంట పడ్డారని సమంత తెలియజేశారు. అయితే ఎప్పుడు కూడా దగ్గరకు రాలేదని నేను కాలేజీకి వెళ్లగా కొంత దూరంలో నిలబడి వెళ్లిపోయే వారని తెలిపారు. ఇలా రెండు సంవత్సరాల పాటు నా వెంట పడటంతో ఒకరోజు ఎందుకు నువ్వు నా వెంటే పడుతున్నావని ఆ అబ్బాయిని అడగగా ఆ అబ్బాయి నీ వెంట నేను పడటం ఏంటి అని చెప్పారు దాంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యానని తెలిపారు. అయితే మరి అది లవ్ నా కాదా అనే విషయం నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే ఫస్ట్ లవ్ అంటూ సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: Vyooham Movie Review: వ్యూహం సినిమా రివ్యూ అండ్ రేటింగ్?

ట్రెండింగ్ వార్తలు