నన్ను ఎంతో సహనంతో భరించారు: రష్మిక

December 31, 2023

నన్ను ఎంతో సహనంతో భరించారు: రష్మిక

Seven Glorious Years For Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొని నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరస బాలీవుడ్ సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇక ఈమె కన్నడలో నటించిన మొట్టమొదటి చిత్రం కిరిక్ పార్టీ. కాంతార ఫేమ్ రిషభ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కినటువంటి ఈ సినిమా సరిగ్గా నేటికీ విడుదల ఏడు సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో(Seven Glorious Years For Rashmika) ఈమె తన సినీ కెరియర్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా తన మొదటి సినిమా విడుదల తేదీని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎడేళ్ల ఈ ప్రయాణం ఎంతో మంచిగా సాగింది. ఈ ప్రయాణంలో మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే నన్ను ఓపికతో భరించారు. ఏడేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చి నేను ఈ స్థాయిలో ఉండటాన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మీ సహనానికి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా రష్మిక తన సినీ కెరియర్ ని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈమె కన్నడలో ఈ సినిమాల్లో నటించి హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అవకాశాలను అందుకున్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక మందన్న అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈమెకు ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు

Read Moreస‌ముద్రం మ‌ధ్య‌లో షూట్‌..తండేల్ నుండి నాగ‌చైత‌న్య ఎన‌ర్జిటిక్ పోస్ట‌ర్

ట్రెండింగ్ వార్తలు