September 1, 2022
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం తర్వాత రష్మికా మందన్నా క్రేజ్ కూడా అమాతం పేరిగి పోయింది. ఆల్రెడీ హిందీలో సిదార్థ్ మల్హోత్రా ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’ చిత్రాలు చేసింది రష్మికా మందన్నా. ఈ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. రణ్‌బీర్ కపూర్‌తో ‘యానీమల్’ సినిమా షూ టింగ్ జరుగుతోంది. ఇటు సౌత్‌లో విజయ్ ‘వారిస్’ (తెలుగు లో ‘వారసుడు’), అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. రష్మికా మందన్నా కెరీర్ ఎంత స్పీడ్‌గా సాగుతుందో చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అయితే రష్మికా మందన్నా కెరీర్‌లో మరో సినిమా చేరనుందనే టాక్ టాలీవుడ్‌లో విని పిస్తోంది.
జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. యువ సుధా ఆర్ట్స్, కళ్యాణ్‌రామ్, కె.హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ లిస్ట్‌లో జాన్వీకపూర్, సమంత, పూజాహెగ్డే రీసెంట్ గా మృణాళ్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా కొరటాల శివ ఆఫీసులో రష్మికా మందన్నా కనిపించారు. దీంతో ఎన్టీఆర్, రష్మికా మందన్నా జోడీ కట్టనున్నారా? అనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. రష్మిక చేతిలో ప్రజెంట్ ‘యానీమల్’, ‘పుష్ప: ది రైజ్’ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో చేయాల్సిన ఓ సినిమా క్యాన్సిల్ అయ్యేలా ఉంది. దీంతో రష్మికా మందన్నా ఈ సినిమాకు ఒకే చెప్పే చాన్సెస్ ఉన్నాయను కోవచ్చు. అదీ ఎన్టీఆర్ వంటి స్టార్‌తో సినిమా చాన్స్ అంటే ఏ స్టార్ హీరోయిన్ కాదనుకోదు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.