రష్మికా..వెంకీ స్పెషల్‌ బాండింగ్‌!

December 16, 2021

రష్మికా..వెంకీ స్పెషల్‌ బాండింగ్‌!

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నా… టాలీవుడ్‌లో హీరోయిన్‌ రష్మికా మందన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. శర్వానంద్‌ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న రష్మికా ఇప్పుడు మరో సూపర్‌ చాన్స్‌ దక్కించుకున్నారు. చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలోని సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నారని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మాత. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Read More: తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఫుల్‌ బిజీ కానున్న‌ స‌మంత‌

‘ఛలో’ సినిమాతో రష్మికా మందన్నాను టాలీవుడ్‌కు పరిచయం చేశారు దర్శకుడు వెంకీ కుడుముల. ఆ తర్వాత వెంకీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సెకండ్‌ మూవీ ‘భీష్మ’ చిత్రంలోనూ రష్మికా మందన్నాయే హీరోయిన్‌. ఇప్పుడు వెంకీ కుడుముల థర్డ్‌ మూవీలో కూడా రష్మికా మందన్నాయే హీరోయిన్‌గా నటించనుండటం విశేషం. ఇక రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్న తాజా చిత్రం పుష్ప’ డిసెంబరు 17న విడుదల కానుంది. ఇక బాలీవుడ్‌లో వ‌రుస‌గా మిషన్‌ మజ్ను, గుడ్‌ బై చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు