Bobby Deol First Look in Kanguva: పుట్టిన‌రోజున‌ భ‌య‌పెడుతోన్న బాబీడియోల్‌

January 27, 2024

Bobby Deol First Look in Kanguva: పుట్టిన‌రోజున‌ భ‌య‌పెడుతోన్న బాబీడియోల్‌

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య.. ప్రస్తుతం కంగువ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. శౌర్యం,శంఖం లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రానుంది. ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

సూర్య కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దిశ ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఇటీవ‌ల యానిమ‌ల్ చిత్రంతో మ‌రింత పాపుల‌ర్ అయిన బాబీడియోల్ నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ రోజు బాబీడియోల్ పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్భంగా కంగువ నుండి అత‌డి లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ లుక్‌లో అతి భ‌యంక‌రంగా ఉన్నాడు..కృర‌మైన, ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో స‌రిగ్గా సెట్ అయ్యాడు బాబీ డియోల్‌.

త్రీడీ ఫార్మట్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తయిందని, యూనిట్‌‌‌‌‌‌‌‌ మొత్తం ఎంతో పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు సూర్య‌. షూటింగ్‌‌‌‌‌‌‌‌ మెమొరీస్‌‌‌‌‌‌‌‌ ఎన్నో ఉన్నాయని, టీమ్ అందరినీ మిస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నానంటూ ఇటీవ‌ల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. .దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Read More: #RC16: రామ్ చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ మూవీ కానుందా?

ట్రెండింగ్ వార్తలు