ఇది ఆరంభం మాత్రమే.. కంగువ సినిమా పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సూర్య!

January 11, 2024

ఇది ఆరంభం మాత్రమే.. కంగువ సినిమా పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నటువంటి సూర్యకు తెలుగులో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఈయన కంగువ అనే భారీ బడ్జెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. శివ డైరెక్షన్లో ఈ సినిమా వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇకపోతే తాజాగా హీరో సూర్య ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన ఈ సినిమాలో తన లుక్ కి సంబంధించినటువంటి ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోని ఈయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ఈ సినిమాలో  నా చివరి షాట్ పూర్తయింది. మొత్తం మూవీ యూనిట్ సానుకూలంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు కాగా.. మరెన్నింటికో ఆరంభం. మంచి జ్ఞాపకాలు అందించిన డైరెక్టర్ కు అలాగే ఇతర చిత్ర బృందానికి ధన్యవాదాలు.

ఈ సినిమా నాకు ఎప్పటికీ చాలా స్పెషల్. ఈ సినిమాని స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సూర్య కంగువ సినిమా గురించి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈయన చివరి షాట్ కి సంబంధించిన ఫోటో షేర్ చేయడంతో ఈ సినిమాలో ఈయనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా జపనీస్ కొరియన్ భాషలలో కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసే అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

Read More: ప్రభాస్ అంటే నాకు ఇష్టం… అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటా?

ట్రెండింగ్ వార్తలు