కంగువ సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టిన సూర్య.. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు!

February 22, 2024

కంగువ సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టిన సూర్య.. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు!

ఈ సంవత్సరం తమిళ ఇండస్ట్రీలో ద మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి సూర్య నటిస్తున్న కంగువ చిత్రం. ఈ చిత్రానికి గత సంవత్సరం నుంచి చాలా హైప్ వస్తుంది. వదులుతున్న ఒక్కొక్క పోస్టర్ ని చూస్తుంటే ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోతున్నారు. అసలు సూర్యని ఆ అవతారంలో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఊహించని రీతిలో సూర్య మేక్ ఓవర్ ఈ సినిమాలో కనిపించనుంది.

ఒక పరాక్రమ వీరుడి కధా నేపథ్యంతో సాగుతున్న ఈ చిత్రంలో దిషా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సూర్య గెటప్ ని చూసి మంచి యాక్షన్ సినిమాలా ఉండబోతుంది అని తెలుస్తుంది. అదే సమయంలో ఈ సినిమాలో బాబి డియోల్ ప్రతినాయకుడుగా కనిపించనున్నారన్న వార్త వచ్చిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. సూర్యకి, బాబి డియోల్ కి మధ్య ఫైటింగ్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే యానిమల్ సినిమాలో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబి డియోల్ కంగ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అని అందరూ తగ ఆరాటపడుతున్నారు. మొన్న మొన్న విడుదలైన టీజర్ ని చూస్తూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగిస్తుంది. తాజాగా సూర్య ఈ సినిమాకు డబ్బింగ్ షురూ చేశాడు అంటూ ఈ చిత్ర బృందం సామాజిక మద్యమాలలో కొన్ని ఫోటోలను విడుదల చేసింది.

ఇందులో సూర్య డబ్బింగ్ చెబుతూ కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ అప్డేట్స్ అన్ని ఈ చిత్ర బృందం త్వరలోనే అఫీషియల్ గా విడుదల తేదీని తెలుపుతుంది అనే సమాచారం వినిపిస్తుంది. ఈ సంవత్సరం విడుదలవ్వబోయే చాలా ప్రెస్టీజియస్ సినిమాలలో ఒకటిగా ఉన్న కంగువ సినిమా మీదే అందరి కళ్ళు ఇప్పుడు ఉన్నాయి. మరి విడుదలైన తర్వాత ఇది సృష్టించే బీభత్సం ఏంటో చూడాలి.

Read More: విక్రమార్కుడు సినిమా కోసం రాజమౌళి రవితేజకు ఇన్ని కండిషన్స్ పెట్టారా.. వామ్మో?

ట్రెండింగ్ వార్తలు