September 1, 2022
హీరోయిన్‌గా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు హీరోయిన్ తమన్నా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సిని మాలు చేశారు తమన్నా. కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో ఓ స్పెషల్ నంబర్ చేశారు. కానీ మలయాళ వెండితెరపై మాత్రం తమన్నా ఇప్పటివరకు కనిపించింది లేదు. కానీ ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కెరీర్‌లో తొలిసారి తమన్నా ఓ మలయాళ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో దిలీప్, దర్శకుడు అరుణ్ గోపీ కాంబినేషన్ లో వచ్చిన మలయాళ చిత్రం ‘రామలీల’ (2017) అద్భుతమైన విజయాన్ని సాధించింది. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత దిలీప్, అరుణ్ గోపీ మరో సినిమా చేస్తున్నారు. దిలీప్‌కు ఇది 147వ సినిమా. ఈ సినిమాలోనేతమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. మలయాళంలో తమన్నాకు ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సెప్టెంబరు 1, 2022న కేరళలో జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక తెలుగు చిత్రాలు చిరంజీవి ‘బోళాశంకర్’, సత్యదేవ్ ‘గుర్తుందా..శీతాకాలం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు తమన్నా. హిందీలో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, భోలే చూడియాన్ అనే సినిమాలు చేశారు తమన్నా. ‘గుర్తుందా..శీతాకాలం’ సినిమా ఈ సెప్టెంబరు 23న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.