దేవర అనుకున్న డేట్ కి రాగలడా?

January 23, 2024

దేవర అనుకున్న డేట్ కి రాగలడా?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవ‌ర‌ రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వ‌హిస్తున్నారు. క‌ళ్యాణ్‌రామ్, కె. హరి కృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మాత‌లు..దేవర’ సినిమాతో బాలీవుడ్ అందాల బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. దేవ‌ర‌ తొలిభాగాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమా విడుద‌ల గురించి ఫిల్మ్‌ నగర్‌ సర్కిల్స్‌లో భిన్నమైన గ్యాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ‘దేవర’ సినిమా విడుదల వాయిదా పడిందనేది ఈ గ్యాసిప్‌ల సారాంశం. అయితే ఈ సినిమాను ఎలాగైన అనుకున్న తేధికే తీసుకురావాల‌ని టీం తెగ క‌ష్ట‌ప‌డిపోతుంది. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్ కార‌ణంగా ప‌లుసార్లు వాయిదా ప‌డ్డ దేవ‌ర షూటింగ్ ఇప్ప‌డు ఈ సినిమాలో మెయిన్ యాంట‌గ‌నిస్ట్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ గాయ‌ప‌డ‌డంతో మ‌రోసారి వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు..

భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్న బడ్జెట్‌కు తగ్గ బిజినెస్‌ కావడం లేదని, ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ఈ సినిమాను పాతికకోట్ల రూపాలయకే బయ్యర్స్‌ అడుగుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో ఎన్టీఆర్‌కు బెస్ట్‌ రికార్డు ఉన్న సినిమా ‘అరవిందసమేత వీరరాఘవ’ ఓవర్‌సీస్‌లో 2.5 మిలియన్‌ డాలర్స్‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పాతికకోట్ల రూపాలయకు అడుగుతున్నారట ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దేవర’ సినిమాకు టీమ్‌ ఆశించినంత‌ బిజినెస్‌ కావడం లేదట. ఇందుకు కారణం..దర్శకుడు కొరటాల శివ తీసిన గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్‌గా నిలవడమే.. అలాగే ఇప్పటికే ‘దేవర’ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఇది 155కోట్ల రూపాయల డీల్‌ అని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నమాట.

కేవలం బిజినెస్‌ మాత్రమే కాదు…భారీగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండటం అనేది ‘దేవర’ రిలీజ్‌ ఆలస్యమవ్వడానికి ఓ కారణం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో వస్తే, ఈ ప్రభావం సినిమాలపై పడుతుంది. ‘దేవర’ వాయిదాకు ఇది కూడా ఓ కారణం కావొచ్చు. అసలు..ఈ గందరగోళమంతా సమసిపోవాలంటే ‘దేవర’ సినిమా టీమ్‌ అధికారికంగా ఓ ప్రకటన రావాల్సి ఉంది.

Read More: మ‌హేశ్-రాజ‌మౌళి సినిమాపై బిగ్ అప్డేట్‌..ఫ్యాన్స్‌కి పండ‌గే..

ట్రెండింగ్ వార్తలు