దేవర మూవీ ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

April 22, 2024

దేవర మూవీ ఐటమ్ సాంగ్ లో చిందులు వేయబోతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా దేవర. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం ఇదే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లీకులు ఫోటోలు టీజర్లకు ప్రేక్షకులు నుంచి భారీగా స్పందన లభించింది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.

అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ ను అందుకోవాలని గట్టిగానే కృషి చేస్తున్నారు. దేవర చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. మేకింగ్‌ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ చిత్రంలో ఒక ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉందట. అందులో ఒక స్టార్‌ హీరోయిన్‌ తో స్టెప్పులు వేయించాలని భావించాడట.

పలువురు హీరోయిన్ లను సంప్రదించగా చివరకు పూజా హెగ్డే ఒప్పుకుందట. పూజా ఇప్పట్టికే రంగస్థలంలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది. దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొరటాల శివ ఐటమ్ సాంగును భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పాటను కంపోజ్‌ చేశాడట. అన్ని కుదిరితే ముందుగానే ఈ స్పెసల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసి తర్వాత ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్‌ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఎన్నికలు, ఐపీఎల్‌ కారణంగా వాయిదా వేశారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఇందులో ఎన్టీఆర్‌కు జోడిగా శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

Read More: ప్రభాస్ కల్కి మూవీ వాయిదా పడటానికి అసలు కారణం అదే?

ట్రెండింగ్ వార్తలు