సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి శ్రీలీల.. కారణం అదే!

February 2, 2024

సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి శ్రీలీల.. కారణం అదే!

శ్రీలీల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె కన్నడ పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పెళ్లి సందడి సినిమా ద్వారా పరిచయమైనటువంటి ఈమె వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం తీరిక లేకుండా గడిపారు. స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు శ్రీ లీల అందరికీ కమిట్మెంట్ ఇస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఈమె నటించిన మొదటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నప్పటికీ తదుపరి సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో శ్రీ లీలను ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇలా ఈమె పట్ల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఈమె ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా శ్రీ లీల పట్ల పలు విమర్శలు వచ్చిన అనంతరం ఈమె పేరును పూర్తిగా క్రిటిక్స్ కూడా పక్కన పెట్టేశారు.

ఇలా అందరూ మర్చిపోతున్నటువంటి తరుణంలో శ్రీ లీల ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇలా ఉన్నఫలంగా ఈమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల డాన్స్ ద్వారా మరోసారి అదరగొట్టిందని చెప్పాలి. ఈమె నటించిన కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటకు దాదాపు 1 మిలియన్ పైగా రీల్స్ రావడం విశేషం.

ఇలా సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కుర్చీ మడత పెట్టే ఫుల్ వీడియో సాంగ్ ఇటీవల చిత్ర బృందం విడుదల చేశారు. ఈ పాటలో శ్రీ లీల మరోసారి తన డాన్స్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ పాటకు ఆమె రెచ్చిపోయి మరి డాన్స్ చేయడంతో ఒక్కసారిగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు.

Read More: బుల్లితెర నటుడికి విడాకులు ఇచ్చిన భార్య.. నెట్టింట వీడియో వైరల్!

ట్రెండింగ్ వార్తలు