ఆ స్టార్ హీరో వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న నటి త్రిష!

February 5, 2024

ఆ స్టార్ హీరో వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న నటి త్రిష!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి త్రిష ఒకరు ఈమె కెరియర్ మొదట్లో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటించారు. అనంతరం హీరోయిన్గా అవకాశం అందుకున్నారు. ఇలా హీరోయిన్గా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాష చిత్రాలలో కూడా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈ రెండు భాషా చిత్రాలలో అగ్ర హీరోలు అందరీ సరసన నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే ఈమె ఒకానొక సమయంలో వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపాయి. దీంతో త్రిష కెరియర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఇలా అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉన్నటువంటి త్రిషకు మణిరత్నం అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఈయన త్రిషను తిరిగి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాలుగు పదుల వయసులో కూడా అదే అందంతో ఈమె మరోసారి కుర్రకారులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత తనకు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి హీరో విజయ్ సరసన లియో సినిమాలో నటించి కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈమె కమల్ హాసన్ సినిమాతో పాటు హీరో అజిత్ సినిమాలో కూడా నటిస్తున్నారు అంతేకాకుండా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది.

ఇదివరకే చిరంజీవి త్రిష కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తిరిగి ఈ సినిమాలో మరోసారి ఈమె కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాల షూటింగ్లలో పాల్గొనడానికి త్రిష కు చాలా ఇబ్బందిగా మారుతుందని తెలుస్తుంది అజిత్ తో ఈమె నటించే సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి జరగకపోవడంతో తన కాల్ షీట్స్ అన్నీ కూడా పూర్తిగా తారుమారు అవుతున్నాయని తద్వారా ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

Read More: ‘ఎర్ర‌చీర’ ద‌ర్శ‌కుడి ‘ఊచ‌కోత‌’..ఈ సారి ఏకంగా సంక్రాంతి బరిలో..

ట్రెండింగ్ వార్తలు