రౌడీ హీరో ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతోందా.. అందుకే విజయ్ ను నీల్ కలిసారా?

April 24, 2024

రౌడీ హీరో ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతోందా.. అందుకే విజయ్ ను నీల్ కలిసారా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ పుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది ఖుషి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అలాగే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి రిలీజ్ రోజే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ రావడంతో వసూళ్లపై ప్రభావం చూపించింది. కానీ మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు విజయ్. ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టాడు విజయ్. నెక్ట్స్ సెలక్ట్ చేసుకునే సినిమాల విషయంలో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకున్నారు. విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ అతిథిగా వెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీరి మీటింగ్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతుందంటూ ప్రచారం నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Read More: పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఎప్పడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు