మొద‌లైన‌ ఆషికీ 3..ఈ సారి హీరో ఎవ‌రో తెలుసా?!

September 5, 2022

మొద‌లైన‌ ఆషికీ 3..ఈ సారి హీరో ఎవ‌రో తెలుసా?!

హిందీ చిత్రాలు ‘ఆషికీ’ (1990), ‘ఆషికీ 2’ (2013) చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిత్యారాయ్‌ కపూర్, శ్రద్ధా కపూర్‌ జంటగా మోహిత్‌ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ 2’బాక్సాపీస్‌ రికార్డులను సృష్టించింది. దాదాపు 18 కోట్లతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద దాదాపు 100 కోట్ల రూపాయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆషికీ 3కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ సెప్టెంబరు 5నవచ్చింది. బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. ఆషికీ చిత్రానికి మహేశ్‌భట్, ఆషికీ2కు మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆషికీ 3 చిత్రానికి మాత్రం అనురాగ్‌ బసు దర్శకత్వం వహిస్తారు. ప్రీతమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇక టీ సిరీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

Karthik Aryan  

ట్రెండింగ్ వార్తలు