య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌లో సమంత..త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌!

November 29, 2021

య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌లో సమంత..త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌!
నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత ఒక‌సారి ప్ర‌ముఖ పుణ్య‌క్ష్రేతాల‌ను ద‌ర్శించి పూర్తిగా కెరీర్‌పై దృష్టి సారించింది స‌మంత‌. తెలుగు త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు ఓకే చేసింది అలాగే రీసెంట్‌గా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు స‌మంత బాలీవుడ్‌లోను త‌న టాలెంట్‌ను ప‌రిక్షించుకోనుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ ఫేమ‌స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యశ్‌రాజ్ ఫిలిమ్స్ తో ఒక‌టి క‌న్నా ఎక్కువ ప్రాజెక్టులు చేసేందుకు డీల్ కుదుర్చుకుంద‌ట‌. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టి కావ‌డం, ఇటీవ‌ల ఫ్యామిలిమెన్ 2 సిరీస్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ కూడా భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ద‌మైంద‌ట‌. సాధార‌ణంగా య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నాలుగు లేదా ఐదు సంవ‌త్స‌రాలు అగ్రిమెంట్ ఉంటుంది. కత్రినాకైఫ్, అనుష్క శర్మ, కరీనా కపూర్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ విష‌యంతో ఇదే జ‌రిగింది. అయితే స‌మంత కూడా వాళ్ల ష‌ర‌తుల‌కు ఓకే చెప్తుందా లేదా ఇప్ప‌టికే త‌ను ఒప్పుకున్న సినిమాల త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు