బాలీవుడ్ రామాయణం పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన యశ్.. ఆ పాత్రలో నటించడంతో పాటు?

April 12, 2024

బాలీవుడ్ రామాయణం పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన యశ్.. ఆ పాత్రలో నటించడంతో పాటు?

బాలీవుడ్ లో నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం తెరకెక్కబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించబోతున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయంపై మూవీ మేకర్స్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం వీరి పేర్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఎవరూ అధికారికంగా క్లారిటి ఇవ్వలేదు. తాజాగా నేడు ఈ రామాయణంపై క్లారిటీ వచ్చేసింది.

నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ నిర్మాణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. తన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా రామాయణం నిర్మాణంలో పాలు పంచుకోనుంది. హాలీవుడ్ లో ఎన్నో భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన DNEG సంస్థ ఈ రామాయణానికి కూడా అవిజువల్ ఎఫెక్ట్స్ అందించబోతుంది. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ లో పనిచేసిన DNEG విజువల్ ఎఫెక్ట్స్ అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్ర నేడు యశ్ తో దిగిన ఫోటో షేర్ చేసి రామాయణం సినిమా గురించి మాట్లాడాడుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. US, UK, ఇండియా లాంటి దేశాల్లో వ్యాపారాల్లో సక్సెస్ అయి పలు సినిమాలతో మెప్పించిన నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీస్తున్నాను.

కర్ణాటక నుండి వచ్చి ఈ రోజు ప్రపంచం గర్వించే KGF 2 సినిమా వరుకు యశ్ చాలా కష్టపడ్డాడు. అతనితో కలిసి ఈ ప్రాజెక్టు చేయడం గర్వంగా అంది అని తెలిపారు. కాగా ఈ ప్రాజెక్ట్ పై యశ్ కూడా స్పందిస్తూ.. నాకు ఎప్పటి నుంచో మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని కల. నేను, నమిత్ రామాయణం చేస్తే బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాము. అంత పెద్ద సబ్జెక్టు తీయాలి అంటే ఖర్చు కూడా భారీగానే అవుతుంది. అందుకే నిర్మాణంలో నేను కూడా భాగమయ్యను. రామాయణానికి నా మనసులో ఒక మంచి స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. దీనికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తారు అని తెలిపారు. అయితే యష్ మాటలను బట్టి చూస్తే బాలీవుడ్ రామాయణం ప్రాజెక్టు ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది..

https://telugu.chitraseema.org/sukumar-comments-about-samantha-facts-goes-viral-on-social-media/  

ట్రెండింగ్ వార్తలు