రామాయణంతో రాబోతున్న రాఖీ భాయ్.. ఇదే అసలైన రామాయణం!

April 12, 2024

రామాయణంతో రాబోతున్న రాఖీ భాయ్.. ఇదే అసలైన రామాయణం!

రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఇప్పటివరకు వివిధ భాషలలో రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీటిలో ఏది ఖచ్చితమైన రామాయణం అనే విషయం మాత్రం తెలియదు కానీ ఈసారి మాత్రం రాకింగ్ స్టార్ మేము అసలు సిసలైన రామాయణం తీయబోతున్నామని తెలిపారు.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ మంచి విషన్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యాష్ తో కలిసి రామాయణాన్ని నితేష్ తివారి దర్శకత్వంలో, DNEG విశువల్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటి వరుకు ఎప్పుడు చూడని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ US, UK, ఇండియా ఇలాంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు వెళ్లినా నా ఈ ప్రయాణంలో నేను రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుండి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యష్ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ చేయడానికి యష్ వంటి వారితోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా రాఖీ బాయ్ యశ్ మాట్లాడుతూ.. తనకు ఎప్పటినుంచో ఒక కల ఉండేదని తెలిపారు. మన భారతీయ చలన చిత్రాన్ని భారతీయ వేదికగా ఉండాలన్న ఉద్దేశంతోనే నమిత్ తో కలిసి రామాయణం చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాము కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం సాధ్యమా అని భావించాము ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టు చేయాలి అంటే బడ్జెట్ కూడా అధికంగా అవుతుంది కనుక తాను కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నామని యశ్ తెలిపారు.

మన జీవితాలకు రామాయణం ఎంతో ముడిపడి ఉంది మనం రామాయణాన్ని ఎంతగానో విశ్వసిస్తూ ఉంటాము. ఈ సినిమా తీయడం వెనుక మా ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్ వేదిక పైన ఈ రామాయణాన్ని వెండితెరపై చూపించాలన్నదే తమ విజన్ అంటూ ఈ సందర్భంగా రామాయణం గురించి రాఖీ బాయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://telugu.chitraseema.org/janhvi-kapoor-drives-a-condition-for-every-film/

ట్రెండింగ్ వార్తలు