పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా.. వివాదాస్పద వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

February 17, 2024

పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా.. వివాదాస్పద వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇలా పలువురు జాతకాలని చెబుతూ పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఎదుర్కొంటు పలు వివాదాలలో నిలుస్తున్నారు.

ఈ విధంగా వేణు స్వామి గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చిన ఈయన మాత్రం సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి ఎన్నో సందర్భాలలో మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేరని ఆయన ఎమ్మెల్యే కావచ్చు కానీ ముఖ్యమంత్రి మాత్రం కాలేరు అంటూ తెలిపారు. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కు మూడోసారి కూడా విడాకులు ఖాయమంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఈయన కామెంట్లు చేయడంతో ఆయన అభిమానులు భారీ స్థాయిలో వేణు స్వామిని ట్రోల్ చేశారు. ఇకపోతే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి పవన్ గురించి మాట్లాడుతూ నేను ఆయన గురించి మంచిగా మాట్లాడిన నన్ను ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. పవన్ మంచి కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని ఈయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదని ఆయనకు కుటిల రాజకీయాలు అంటే తెలియదని వేణు స్వామి తెలిపారు. నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని ఒకప్పుడు థియేటర్లలో ఆయన సినిమాలు చూస్తూ పేపర్లు చింపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని ఈయన తెలియచేశారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయని ఈయన తెలిపారు. ఇలా పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: మహేష్ లాంటి హీరోకి గుంటూరు కారం సెట్ అవ్వదు.. పరుచూరి కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు