సలార్ విషయంలో నిజమైన వేణు స్వామి కామెంట్స్.. ముందే చెప్పానంటూ?

March 14, 2024

సలార్ విషయంలో నిజమైన వేణు స్వామి కామెంట్స్.. ముందే చెప్పానంటూ?

వేణుస్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన హీరోల గురించి సినిమా సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్పడంతో పలువురు ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి తరచూ ఏదో ఒక కామెంట్ చేయడం ఆయన అభిమానులు ఈయనని ట్రోల్ చేయడం వంటివి సాధారణంగా జరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలోనే గతంలో వేణు స్వామి ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు నష్టాలు వస్తాయని ఈ సినిమా సక్సెస్ కాదని తెలిపారు. కానీ ఈ సినిమా మంచి వసూలు రాబట్టడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. ఈ సినిమా హిట్ కాదని చెప్పారు కానీ, ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుందంటూ వేణు స్వామి జ్యోతిష్యాన్ని తప్పుపట్టారు.

ఇకపోతే తాజాగా ఇటీవల సలార్ నిర్మాతలు కొన్ని ప్రాంతాలలో భారీ స్థాయిలో నష్టాలు వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బును వెనక్కి ఇచ్చారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా సలార్ సినిమా గురించి ఈ విషయం బయటకు రావడంతో వేణు స్వామి రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా వేణు స్వామి సలార్ సినిమా విషయం గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సినిమా సక్సెస్ కాదని ఈయన ముందే చెప్పారు అయితే తాజాగా వేణు స్వామి ఈ సినిమా పై స్పందిస్తూ.. తాను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాను కదా? అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నట్టుగా నే చెప్పలే చెప్పలే.. అంటూ వచ్చిన ఫన్నీ మీమ్‌ను ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇలా సలార్ విషయంలో వేణు స్వామి వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయన చేసినటువంటి పోస్ట్ కూడా వైరల్ గా మారింది.

Read More: Sivaji: ఎన్నికలలో నిలబడటం అంటే ప్రకృతి వనరులు దోచుకున్నట్టే!

ట్రెండింగ్ వార్తలు