హీరోయిన్లకు పూజ చేస్తే వేణు స్వామి డబ్బు తీసుకోరా.. ఎందుకంటే?

April 23, 2024

హీరోయిన్లకు పూజ చేస్తే వేణు స్వామి డబ్బు తీసుకోరా.. ఎందుకంటే?

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. వృత్తిపరమైనటువంటి జ్యోతిష్యం గురించి ఎన్నో సందర్భాలలో పలువురు సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ వారి జాతకాలను బయట పెడుతూ ఉంటారు. ఈ విధంగా వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలను చెప్పడంతో పలుసార్లు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈయన సెలబ్రిటీల గురించి నెగిటివ్గా జ్యోతిష్యం చెబితే ఎంతోమంది అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా వాటన్నింటి గురించి ఈయన పెద్దగా పట్టించుకోరు అని చెప్పాలి అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను హీరోయిన్లకు పూజలు కనుక చేస్తే ఫీజు ఏమాత్రం తీసుకొని అని తెలిపారు.కాకపోతే రష్మిక చాలా బలవంతంగా డబ్బు ఇచ్చిందని వేణు స్వామి తెలియచేశారు.

ఇక వారు డబ్బు ఇస్తామని చెబితే కనుక తనతో పాటు పూజ చేసిన తన టీం కి ఒక 50,000 రూపాయలు ఇవ్వమని తాను చెబుతానని తెలిపారు. నాకు బిజినెస్ మెన్స్ అలాగే ఎన్ఆర్ఐ ల నుంచి పది లక్షల రూపాయలు దాకా ఫీజులు వస్తుంటాయి అందుకే నేను అమ్మాయిల దగ్గర డబ్బులకు కకృతి పడనని తెలిపారు.

అమ్మాయిలలో తాను అమ్మవారిని చూసుకుంటానని అందుకే ఎవరైనా కష్టాలలో ఉంటే తనకు తోచిన సహాయం చేస్తానని తెలిపారు .కరోనా సమయంలో తాను ఇబ్బందులలో ఉన్నటువంటి మహిళలకు ఏకంగా లక్షల్లో డబ్బులు ఖర్చు చేశానని ఈయన వెల్లడించారు. ఇక తాను రాజకీయ నాయకులు బిజినెస్ మెన్స్ దగ్గర మాత్రమే డబ్బు తీసుకుంటానని తెలిపారు. నాకు ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అందుకోసమే డబ్బుకు పెద్దగా ఆరాటపడను అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: ఒక్క ఫైట్ సీన్ కోసం 26 రోజులు.. అంచనాలు పెంచుతున్న చిరంజీవి మూవీ?

ట్రెండింగ్ వార్తలు