వేణు స్వామిని కలవాలంటే ఇన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా?

March 16, 2024

వేణు స్వామిని కలవాలంటే ఇన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా?

ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన గత కొంతకాలంగా జ్యోతిష్యం చెబుతూ ఎంతో మంచి సక్సెస్ అయ్యారు కానీ ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకొని విడిపోతారు అని చెప్పారో ఆ క్షణమే పాపులర్ అయ్యారు. ఇక ఈయన చెప్పిన విధంగానే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో వేణు స్వామి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

ఇలా వేణు స్వామి చెప్పే వ్యాఖ్యలన్నీ కూడా నిజమవుతున్నటువంటి తరుణంలో ఈయనని నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. చాలామంది నేను జాతకాలు చెప్పే విషయంపై నన్ను విమర్శలు చేస్తూ ఉంటారని తెలిపారు. ఆ వేణు స్వామి జాతకమే బాగుంటే అందరి జాతకాలు ఎందుకు చెబుతారు అంటూ నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారని ఈయన తెలిపారు. నేను కేవలం జాతకాలను చెబుతూ మాత్రమే బ్రతకలేదని ఈయన తెలిపారు నా భార్య వీణా వాణి చాలా ఫేమస్ వీణ వాయిద్యారాలని తెలిపారు.ఆమె కూడా మంచిగా సంపాదిస్తున్నారు. ఇక నేను జ్యోతిష్యం మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను వైన్ షాప్స్ ఉన్నాయి పబ్బులు ఉన్నాయి అంటూ ఈయన తన వ్యాపారాలు అన్నింటిని బయటపెట్టారు.

ఇక వేణు స్వామి చేత మనం జాతకం చెప్పించుకోవాలి అంటే వెంటనే కుదరదని ఈయన వద్ద కొన్ని నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలనే వార్త కూడా వైరల్ అవుతుంది. దాదాపు 8 నెలలకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఈ విషయం గురించి వేణు స్వామి మాట్లాడుతూ నేను జ్యోతిష్యం మాత్రమే చెప్పను. నేను నా వ్యాపారాలను చూసుకుంటాను అంతేకాకుండా నా ఫ్యామిలీకి కూడా కాస్త సమయం కేటాయించాలి మరో వైపు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అంటూ చాలా బిజీగా ఉంటాను. అందుకే ముందుగానే అపాయింట్మెంట్ ఇస్తానని తెలిపారు. ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్లకు మా టీం పలానా రోజు మీకు జ్యోతిష్యం చెప్పబడును అంటూ అపాయింట్మెంట్ ఇస్తారని అదే రోజే నేను వారి జాతకాలు చెబుతాను అంటూ ఈయన ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: ఆనంద్ దేవరకొండ రష్మికను అలా పిలుస్తారా.. ఏదో తేడాగా ఉందే?

ట్రెండింగ్ వార్తలు