నయనతార విగ్నేష్ ఎప్పటికీ విడిపోరు…

March 12, 2024

నయనతార విగ్నేష్ ఎప్పటికీ విడిపోరు…

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నయనతార తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఈమె గతంలో పలువురితో ప్రేమలో పడి బ్రేకప్ లు చెప్పుకున్నప్పటికీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి డైరెక్టర్ విగ్నేష్ ప్రేమలో ఉన్నారు.

ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ దంపతులకు సరోగసి ద్వారా ఇతర కవల పిల్లలకి జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తన భర్త పిల్లలతో నయనతార ఎంతో బిజీగా గడుపుతున్న మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు మరోవైపు ఈమె ఎన్నో రకాల వ్యాపార సంస్థలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తన వృత్తిపరమైన జీవితంలోనూ అలాగే వ్యక్తిగత జీవితంలోని ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నయనతార గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని త్వరలోనే మీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగా నయనతార కూడా ఓడిపోయాను అంటూ పోస్టులు చేయడంతో నిజమేనని అందరూ భావించారు.

ఇలా వీరి విడాకుల వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో నయనతార మాత్రం వీరిద్దరు తన పిల్లలతో సంతోషంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా నయనతార విగ్నేష్ విడాకుల గురించి పలువురు విశ్లేషకులు స్పందిస్తూ వీరిద్దరు విడిపోయే అవకాశాలు ఏ మాత్రం లేవని తేల్చి చెప్పారు. ఎందుకంటే నయనతార సంపాదించిన ఆస్తులు అన్నింటిని కూడా పెట్టుబడుల రూపంలో విగ్నేష్ పెట్టించారని అలా పెట్టుబడులు పెట్టాలని ఆమెకు సలహాలు సూచనలు కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇక నయనతార చేస్తున్నటువంటి ఈ వ్యాపారాలన్నింటికీ విగ్నేష్ ఫౌండర్ గాను లేదా సీఈఓ గాను ఉన్నారు. కనుక వీరిద్దరూ విడిపోయే అవకాశం ఏమాత్రం లేదని తెలియజేస్తున్నారు.

Read More : డైరెక్టర్ సూర్య కిరణ్ మరణానికి అసలు కారణం ఇదేనా

ట్రెండింగ్ వార్తలు