కామెంట్ చేస్తేనే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా.. హీరోను బ్లాక్ మెయిల్ చేసిన లేడీ ఫ్యాన్స్?

February 19, 2024

కామెంట్ చేస్తేనే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా.. హీరోను బ్లాక్ మెయిల్ చేసిన లేడీ ఫ్యాన్స్?

సాధారణంగా హీరోలు లేదా హీరోయిన్స్ అంటే పెద్ద ఎత్తున వారికి అభిమానులు ఉంటారు. ఇలా అభిమానులు తమ అభిమాన హీరోలు లేదా హీరోయిన్లు తమతో మాట్లాడాలని తను చేసే కామెంట్లకు రిప్లై ఇవ్వాలి అంటూ ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరోకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా విజయ్ ని అనుసరించే వారిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పాలి.

ఇలా ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు ఇద్దరు అమ్మాయిలు ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ వీడియోకి విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తేనే మేము ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాము అంటూ విజయ్ దేవర కొండను ట్యాగ్ చేస్తూ వారి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియో చూసినటువంటి నెటిజన్స్ వీడియోకి విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడం ఏంటి అంటూ వివిధ రకాలుగా కామెంట్ చేశారు.

ఇకపోతే ఈ వీడియో పై విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ లేడీ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మీరు కనుక ఎగ్జామ్స్ లో 90% మార్క్స్ తెచ్చుకుంటే స్వయంగా మిమ్మల్ని కలుస్తాను అంటూ విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై కొందరు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

వాళ్ళు కనుక 90% తెచ్చుకోకపోతే మనం వెళ్లి వాళ్ళని కలుద్దాం అంటూ కొందరు కామెంట్లు చేయక వీళ్ళు ఫెయిల్ అయితే 24 అవర్స్ కంటిన్యూగా లైగర్ సినిమా చూపించాలి అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడంతోనే వారు 90% మార్కులు తెచ్చుకున్నంత హ్యాపీగా ఉంటారు అంటూ మరికొందరు పాజిటివ్గా ఈ వీడియో పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: అంతకు మించిన అనుభూతి మరొకటి లేదు.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు