అతని పెళ్లి కోసం ఏకంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అతనెవరంటే!

April 24, 2024

అతని పెళ్లి కోసం ఏకంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అతనెవరంటే!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ప్రస్తుతం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే విజయ్ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫ్యాన్స్‌లో రౌడీ బాయ్‌గా ముద్రవేసుకున్న ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు.

విజయ్‌ తన చుట్టూ ఉండే తన సిబ్బందిని కూడా కుటుంబసభ్యులుగా భావిస్తారని తెలిసిందే. విజయ్‌ పబ్లిక్‌ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తనకు రక్షణగా బాడీ గార్డ్స్‌ ఉంటారు. ఎప్పుడూ విజయ్‌ కోసం వెన్నంటి ఉండే వారిలో ఒకరిది తాజాగా వివాహం జరిగింది. ఆ వేడుకలలో విజయ్‌ కూడా పాల్గొని సందడి చేశారు. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా రవి అనే యువకుడి పెళ్లికి తన కుటుంబంతో సహా వెళ్లారు. గత కొన్నేళ్లుగా విజయ్‌ వద్ద ఆ యువకుడు వ్యక్తిగత బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఆ వివాహానికి తన తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు.

నూతన వధూ వరులను విజయ్‌ కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో రవి కుటుంబ సాంప్రదాయం ప్రకారం హీరో విజయ్‌కి కత్తి బహుకరించి పెద్దలు సన్మానం చేశారు. దీంతో విజయ్ కూడా ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read More: సరికొత్త లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్.. ఏమున్నాడురా బాబు అంటూ?

ట్రెండింగ్ వార్తలు