మీరే నా ఫ్యామిలీ స్టార్.. తప్పు చేసి ఉంటే క్షమించండి నాన్న: విజయ్ దేవరకొండ

April 5, 2024

మీరే నా ఫ్యామిలీ స్టార్.. తప్పు చేసి ఉంటే క్షమించండి నాన్న: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన నేడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితం ఎలా ఉంటుందనే అంశాలతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తరుణంలో విజయ్ దేవరకొండ తన తండ్రి గురించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈయన తన తండ్రి గురించి చెబుతూ తన తండ్రే తమ ఫ్యామిలీకి స్టార్ అని ఆయనే నా హీరో.. నా స్టార్ అంటూ పోస్ట్ వేశాడు. ఇక ఆయన మా కోసం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, తన సంతోషాన్ని వదులుకున్నారని తండ్రి గురించి ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ వేశాడు.

ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే మిమ్మల్ని తల దించుకునేలా చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి.నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం నాన్నా అని ఎమోషనల్ అయ్యాడు. ఇక చిన్న నాటి ఫోటోలను, తండ్రితో ఉన్న మెమోరీస్‌ను పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన షేర్ చేసినటువంటి ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: ఓటీటీ విడుదలకు సిద్ధమైన విశ్వక్ సేన్ గామి.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు