April 4, 2024
నటుడు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఏప్రిల్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో సెన్సార్ కార్యక్రమాలన్నిటిని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ది సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఫ్యామిలీ స్టార్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళ గైడెన్స్ లో సినిమా చూడాలని దాని అర్థం. ఇక ఫ్యామిలీ స్టార్ చిత్ర నిడివి 2 గంటల 43 నిమిషాలు.
ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినటువంటి సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక నటి మృణాల్, విజయ్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా మిడిల్ క్లాస్ భర్తగా విజయ్ ఎంతో అద్భుతంగా నటించారని వెల్లడించారు.
విజయ్ దేవరకొండ పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉన్నాయట. గతంలో ఎన్నడు లేని విధంగా బీభత్సమైన ఫైట్స్ ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ చేశాడని అంటున్నారు. క్లైమాక్స్ భారీ ఫైట్ తో సినిమా ముగుస్తుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ నటన కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని తెలిపారు. మొత్తానికి ఈ సినిమా ద్వార గత కొద్దిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి విజయ్ దేవరకొండకు హిట్ దాహాన్ని తీర్చబోతుంది అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More: కొత్త మెరుపులతో మళ్లీ వస్తున్న స్టార్ హీరోయిన్లు.. క్రేజీ కాంబినేషన్లలో సమంత, పూజ హెగ్డే!