నడిరోడ్డు పై బూతులు మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఆ బూతులు ఏంటంటూ ట్రోల్స !

April 3, 2024

నడిరోడ్డు పై బూతులు మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఆ బూతులు ఏంటంటూ ట్రోల్స !

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు .ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ఈయన చాలా విభిన్నంగా ఎంట్రీ ఇచ్చారు బైక్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఎక్కించుకొని మరి అభిమానులతో కలిసి ఈయన ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే విజయ్ దేవరకొండ హీరోయిన్ తో పాటు ఇలా బైక్ పై వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు . ఈ ర్యాలీలో భాగంగా కాస్త ట్రాఫిక్ కూడా ఏర్పడింది. అయితే ట్రాఫిక్ ఉండడంతో విజయ్ దేవరకొండ ఏకంగా బూతులు మాట్లాడారు.

ట్రాఫిక్ అవడంతో విజయ్ దేవరకొండ ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో ఈయన మాట్లాడుతూ అరే జరగండ్రా నీయబ్బా అంటూ బూతులు మాట్లాడటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నడిరోడ్డుపై ఇలా బూతులు మాట్లాడటం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ బూతు మాటలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Read More: ఇదేం టైటిల్ బాబీ… బాలయ్య సినిమా కోసం ఇంత చెత్త టైటిలా.. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా?

ట్రెండింగ్ వార్తలు