ఎప్పటికీ అతనే నా ఫేవరెట్ కో స్టార్.. మృణాల్ కామెంట్స్ వైరల్!

April 3, 2024

ఎప్పటికీ అతనే నా ఫేవరెట్ కో స్టార్.. మృణాల్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నటువంటి మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తాజాగా తెలుగులో కూడా ఎంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తెలుగులో కూడా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు క్రమక్రమంగా తెలుగులో కూడా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు తెలుగులో కూడా ఎంతో బిజీగా మారిపోయారు. ఇటీవల హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మృణాల్ ఠాగూర్ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు తన ఫేవరెట్ కోస్టార్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తన ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే చెప్పడం కష్టమే కానీ నాకు మాత్రం ఎప్పటికీ దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ కోస్టార్ అంటూ ఈమె చెప్పుకు వచ్చారు.

తనతో కలిసి నేను సీతారామం సినిమాలో నటించాను. అయితే ఈ సినిమాలో నేను పోషించిన పాత్రలో నటించడం అంటే చాలా కష్టమని చెప్పాలి. కానీ నన్ను ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగానని తెలిపారు. ఇప్పుడు నేను ఇన్ని భాషలలో సినిమాలు చేస్తున్నాను అంటే దుల్కర్ సల్మాన్ స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్లగలుగుతున్నాను అంటూ ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ గురించి మృణాల్ ఠాకూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఏపీలో అధికార మార్పిడి… రక్తపాతం తప్పదు: వీకే నరేష్

ట్రెండింగ్ వార్తలు