January 27, 2024
టాలీవుడ్ నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర పాన్ ఇండియా దాటి హాలీవుడ్ లో అడుగుపడింది. జనవరి 20 నుంచి ఓటీటీ లో రన్ అవుతున్న సలార్ గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గరైంది. హాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌లో కంటే ఫారిన్ దేశాల్లోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ దీంతో వారిలో సలార్‌ను చూసి బాగుంది, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్లో క్రేజ్ దక్కుతోంది.
సలార్ చూసిన ఇతర దేశాల అభిమానులు ఎక్స్ పేజీ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. దీంతో #SalaarGoesGlobal హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్ సూపర్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇండియన్ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.
Read More: మెగాస్టార్‌ను ఘనంగా సత్కరించబోతున్నాం – దిల్‌రాజు