August 30, 2022
ప్రతి ఏడాది సంక్రాంతి సమయానికి రిలీజ్ అయ్యేందుకు సినిమాలు క్యూ కడుతుంటాయి. ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతి సందడి మొదలైపోయంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, విజయ్ ‘వారసుడు’, వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం..సంక్రాంతి రిలీజ్‌లను ఇప్పటివరకు కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ సంక్రాంతి రేసులో మరో సినిమా వచ్చి చేరింది. ప్రతి సంక్రాంతికి ఓ డబ్బింగ్ సినిమా టాలీవుడ్‌లో రిలీజ్‌కు ఉంటుంది. ఈ సారి కూడా ఉంది. అదే అజిత్ చిత్రం.
‘నెర్కొండపరవై’ ( హిందీ హిట్ ‘పింక్’ తమిళం రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత అజిత్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తమిళంలో సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదే నిజమైతే కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అజిత్ వర్సెస్ విజయ్ క్లాష్ తప్పదు.మరి..అజిత్ చిత్రం సంక్రాంతికి తెలుగులో కూడా విడుదలు అవు తుందా? లేదా? అనేది చూడాలి.