`అఖండ` అఖండమైన విజయాన్ని సాధించాలి – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

November 27, 2021

`అఖండ` అఖండమైన విజయాన్ని సాధించాలి – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అఖండ ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలి – ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో…

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘బోయపాటి గారికి థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లు అరుపులు కేకలతో నిండిపోవాలి. మాకు ఇప్పుడు ఎంత ఆనందం వచ్చింది.. తెలుగు వాళ్లందరికి అదే ఆనందం రావాలి.. రావాలి కాదు.. కచ్చితంగా వస్తుంది అని చెబుతున్నా. బాలయ్య బాబు ఒక ఐటమ్ బాంబు.. ఎలా ప్రయోగించాలో శ్రీనుకు తెలుసు. ఆ సీక్రెట్ ఎంటో శ్రీను చెప్పాలి. బాలయ్య బాబు కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు మనం చూసింది మచ్చు తునకే. సినిమాలో ఇలాంటివి బోలెడు ఉంటాయి. అఖండ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్‌లో చూస్తాను. అఖండ చాల పెద్ద హిట్ అవ్వాలి. ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలి. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాతకు అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చినందుకు బన్నీ, రాజమౌళికి థాంక్స్. ఇండస్ట్రీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. బాలయ్య ఎంతో ఆధ్యాత్మికం. లాస్ట్ 48 రోజులు అఖండ కోసమే పని చేస్తున్నాను. కాశీకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది. బాలయ్య ట్రాన్స్‌ఫార్మర్ అయితే.. ఆయనకు కరెక్ట్ వోల్టెజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి. నేను నా కెరీర్‌లో వాయించింది ఫస్ట్ సినిమా భైరవ దీపం. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అప్పుడు నాకు 30 రూపాయలు ఇచ్చారు. అఖండ సంగీతం అందించినందుకు రుణపడి ఉన్నాను. నాకు దేవున్ని చూస్తున్నట్టే ఉంది. ఇంకా అఖండ ట్రాన్స్‌లోనే ఉన్నాను. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పెద్ద ఎన్టీఆర్ పనిచేసిన ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం’ అని అన్నారు.

దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ఎన్‌బీకే అంటే ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ, ఒక విస్ఫోటనం. మాస్ గాడ్ అంటే బాలయ్య. అభిమానుల్లో ఒకడిగా నేను ఇక్కడికి వచ్చా. సమర సింహా రెడ్డి సినిమా టికెట్ల కోసం ఒంగోలులో రెండు రోజులు లాకప్‌లో ఉన్నా. బోయపాటి శ్రీను మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. సింహా, లెజెండ్‌లను మించి అఖండ బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా అదిరిపోయిందని థమన్ చెప్పాడు. అఖండ ఫస్ట్ లుక్ నుంచి థియేటర్ ట్రైలర్ వరకు మాస్‌కు కావాల్సిన స్టఫ్ ఉంది. శ్రీకాంత్ గారు అంతా స్ట్రాంగ్‌గా ఉంటే.. బాలయ్య గారు ఇంకా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో ఊహించుకోండి’ అని అన్నారు..

లిరిసిస్ట్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరైన నమ్మడం కష్టం. బోయపాటి శ్రీను రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను ఇక్కడ రాస్తున్నా సాహిత్యానికి స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. నాకు అవకాశం ఇచ్చిన బోయపాటికి, బాలయ్యకు, థమన్‌ గారికి థాంక్స్’ అని అన్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. ‘నాన్న గారు బాలకృష్ణ గారికి పాడిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మీకు తెలుసు. బాలయ్యకు పాడే అవకాశం ఇచ్చినందుకు థమన్‌కు థాంక్స్. నాన్న గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు.. అర్చనలు చేయించి, ఫోన్ చేసి కనుక్కునేవారు. ఆయన ఈ వేదికపై నుంచి థాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఈ ఎనర్జీ చూస్తుంటే.. డిసెంబర్ 2న థియేటర్లలో దబిడి దిబిడే. బోయపాటి- బన్నీ కాంబినేషన్‌లో సరైనోడ్ చేశాను.. అది సూపర్ హిట్. బాలయ్యతో ఇది రెండో సినిమా.. శ్రీరామ రాజ్యంలో లక్ష్మణుడిగా చేశాను.. ఇప్పుడు రావణసురుడిగా చేస్తున్నాను. నా సాఫ్ట్ ఫేస్‌ను బోయపాటి ఇలా చూపించారు. సరైనోడ్ తర్వాత బోయపాటి విలన్ చేస్తానని చెప్పాడు. బాలయ్యతో విలన్‌గా చేయడం ఈజీ కాదు. ఆయన ఎనర్జీ తట్టుకోవడం ఈజీ కాదు. ఆయన డైలాగ్స్ హై ఓల్టేజ్‌లో ఉంటాయి. నా గెటప్‌ కోసం బోయపాటి చాలా కష్టపడ్డారు. అద్దంలో చూసుకుని నేను కాదులే వరదరాజులు అని అనుకున్నాను. బాలకృష్ణ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన ఎనర్జీ సూపర్. బాలయ్య బాబు చాలా ప్రోత్సహించారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. సినిమా ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి చెప్పినట్టుగా మహమ్మారి తర్వాత ఈ సినిమాతో థియేటర్లు నిండిపోతాయి’ అని అన్నారు.

పూర్ణ మాట్లాడుతూ.. ‘అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి థాంక్స్. ఇన్నేళ్ల తర్వాత పెద్ద మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా సినిమాల్లో రొమాంటిక్‌గా కనిపించే శ్రీకాంత్‌ను.. ఈ సినిమాలో చూస్తే భయంగా ఉంది. బాలయ్యతో పనిచేయడం చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయన ఎనర్జీ సూపర్. ఆయన గాడ్ ఫాదర్‌లా అనిపించారు. కేరళకు తెలుగు సినిమాలు బన్నీ వల్లే వచ్చాయి’అని అన్నారు.

ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఈరోజు చాలా హ్యాపిగా ఉంది. ఈ సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎపిక్ అవుతుందని మొదటి నుంచి అనుకున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు బోయపాటికి థాంక్స్. బాలయ్య గారికి థాంక్స్. ఆయన ఎనర్జీ, పాజిటివిటీ సూపర్. మీతో కలిసి పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం. నిర్మాతకు థాంక్స్. ఈవెంట్‌కు వచ్చినందుకు బన్నీకి, రాజమౌళి గార్లకు థాంక్స్. అందరూ డిసెంబర్ 2న థియేటర్లలో అఖండ సినిమాను చూసి పెద్ద హిట్ చేయండి’.

ఫైట్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘లక్ష్మి నర్సింహ, సింహా.. తర్వాత బాలయ్యతో ఇది మూడో సారి. రెండో పాత్ర వచ్చినప్పుడు ఫైట్స్ అదిరిపోతాయి. ఇంకో పదేళ్లలో ఇలాంటి ఫైట్స్ ఇప్పట్లో రావు. కెవిన్, స్టీవెన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. బోయపాటి, బాలయ్య ఎనర్జీ సూపర్’ అని అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన రాజమౌళి, అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్. మీ అందరి ఉత్సాహం చూస్తున్నాను. క్షమాపణ చెబుతున్నా. అవుట్ డోర్‌లో చేద్దామని అనుకున్నాను. కానీ వెదర్ బాగా లేదని, వర్షం పడేలా ఉందని ఇలా చేశాం. ఈ సినిమాలో బాలయ్య గారు ఎంతో అందంగా ఉంటారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 2న మీ అందరి ముందుకు రాబోతోంది. 2020 మార్చి ఎలా ఉంది.. థియేటర్లోనే సినిమా చూడాలనే ఆనవాయితి. దానికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్‌ని మళ్లీ అఖండతో ప్రారంభిస్తున్నాం. అ లెగసినీ పుష్ప రాజ్ గానీ, ఆర్ఆర్ఆర్ గానీ ముందుకు తీసుకెళ్తాయి. పాత రోజులు మళ్లీ వస్తాయి. సౌత్‌లో కరోనా భయం లేదు. ఆర్ఆర్ఆర్‌తో నార్త్‌లో కరోనా భయాన్ని పోగొట్టేయాలి. కష్టపడేవాడిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అందుకే బన్నీకి సక్సెస్ వస్తుంది. సినిమా మొదలవుతుంది. జాతర మొదలవుతుంది. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు..

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘జై బాలయ్య.. అనేది ఎప్పుడు నేను చెప్పుకుంటూనే ఉంటాను. టైమ్ అవుతుంది కాబట్టి తక్కువే మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. బన్నీకి, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. గుండెల మీద చేయి వేసుకుని చూసి బయటకు వచ్చేంతా.. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని అడుగు’ అది డైలాగ్. డ్యాన్స్ మాస్టర్స్ భాను, శంకర్‌లు, తొలి రెండు ఫైట్స్.. రామ్ లక్ష్మణ్ చేశారు. తర్వాత స్టంట్ శివ, కెవిన్, స్టీవెన్ మాతో పాటు ట్రావెల్ అయ్యారు. థమన్ అద్బుతమైన సాంగ్స్ అందించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్‌కు హాట్సాఫ్. 21 నెలలుగా మా వెనక ఉన్న మా సినిమా నిర్మాతకు థాంక్స్. బాలకృష్ణ చేయి ఇలా కావడానికి నేనే కారణం. సాంగ్ చేసిన తర్వాత.. స్ట్రెచింగ్ చేయాలి. అయితే జై బాలయ్య సాంగ్ తర్వాత ఇంటికెళ్లి ఆయన స్ట్రెచింగ్ చేస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. కానీ అప్పటికే కోటిన్నరతో తెల్లారి షూట్ కోసం సెట్ చేసింది. రాత్రి ఈ విషయం నాకు తెలిసింది. పొద్దున సెట్‌కు రాగానే సాంగ్ ఆపేద్దామని చెప్పాను. కానీ బాలయ్య గారు ఫ్యాన్స్ కోసం చేయాలి.. చేస్తాను అన్నాడు. బాబు ఆలోచించండి.. దిగిన తర్వాత నేను ఊరుకోను అన్నారు. కానీ బాలయ్య అందుకు ఒప్పుకున్నారు. చేయి లేవకున్నా.. లోపల కట్టి చేసిన సాంగ్ ఇది. షోల్డర్ పెయిన్‌తోనే ఆయన సాంగ్ చేశారు. నేను ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపిగా ఫీలవుతున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి హెల్ఫ్ చేసింది బన్నీ బాబు. ఆ తర్వాత కెరీర్ స్టార్ చేసి.. ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. ఇద్దరి ముందు ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 2న అఖండ రిలీజ్ అవుతుంది. బన్నీ ఈరోజు ఎంత ఎంకరేజ్ ఇస్తున్నాడో.. ఇదే ఎనర్జీతో పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ కూడా ముందుకు నడిపించాలి. అందరూ కలిసి త్రిపుల్ ఆర్‌ను ముందుకు నడిపించాలి. బీమ్లా నాయక్‌ను ముందుకు నడిపించాలి. అఖండతో నేను గెలవాలని అనుకోలేదు.. సినిమా గెలవాలని అనుకున్నాను. సుకుమార్ గెలవడం కాదు.. పుష్ప గెలవాలి. సినిమానే గెలుస్తూ ఉండాలి. ఈ సినిమాకు నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది.. డ్రైవర్స్ యూనియన్, ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్, క్రొకైడల్ జోన్‌లో నాతో నడిచిన సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, నా ఫైట్ మాస్టర్, నా లైట్ ఆఫీసర్స్. నా కెమెరా అసిస్టెంట్స్. కర్ణాటక ఫారెస్ట్, పోలీస్.. డిపార్ట్‌మెంట్స్ చాలా థాంక్స్’ అని అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలు.. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదు.. ఈ నాటి ఈ బంధం ఏనాటిదో. మా తాతగారు వంటింటికి వెళ్లేవారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. బోయపాటి గారి సినిమా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనతో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారు. మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. నేను పైకి వెళ్తుంటే కూడా బోయపాటి గారు ఆనందిస్తుంటారు. మంచి సినిమా కాదు.. మెట్టు ఎక్కే సినిమా చేయాలి అనేవారు. అలానే నాతో సరైనోడు అనే సినిమాను తీశారు. బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూశాను. పూనకాలు వచ్చేలా ఉంది. తాండవంలా ఉందని తమన్ అన్నాడు. తమన్ మామూలు ఫాంలో లేడు.. ముట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండమైన హిట్ సాధించాలి. ఓ సినిమాను ఇన్ని రోజులు ఆపారంటే.. అది ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రగ్యా జైస్వాల్ గురించి నాకు బాగా తెలుసు. ఎంతో మంచి నటి. ఆమెకు ఈ సినిమా బూస్ట్ ఇస్తుంది. శ్రీకాంత్ అన్నయ్య మనసు ఎంతో మెత్తనైంది. ఈయన ఒక విలన్ కారెక్టర్ ఎలా వేయగలరు అని అనుకున్నాను. కానీ బోయపాటి గారు మార్చేశారు. ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నాను.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్. బాలకృష్ణ గారికి ఈ లెవెల్‌లో ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరు. రెండు మూడు పెజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారు. మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం. కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదే. మనిషి మనసులో ఏం పెట్టుకోకుండా ఇలా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో అని అనుకునే వాడిని.. అందుకే ఆయనకు ఇంత ఫ్యాన్ బేస్ వచ్చిందేమో అని అనుకున్నాను. నాకు చాలా పర్సనల్‌గా నచ్చిన విషయం అది. అఖండమైన విజయాన్ని సాధించాలి.. చిన్న సినిమాల మీద చాలా మందికి సింపతి ఉంటుంది. వారికి ఓటీటీలున్నాయి. కానీ పెద్ద సినిమాలకు వచ్చిన కష్టం మామూలు విషయం కాదు. ప్రస్తుతం అంతా కూడా సినిమా గెలవాలని అంటున్నారు. సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నాం.. ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతోన్న పుష్ప ఆ తరువాత రాబోతోన్న ఆర్ఆర్ఆర్..అలా ముందుకు వెళ్లాలి..ఇండస్ట్రీ గెలవాలి.. నన్ను ఇలా పిలిచినందుకు అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదే లే.. మీ అందరి కోసం జై బాలయ్య ’ అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్.. తమ్ముడు అల్లు అర్జున్‌కు థాంక్స్. ఆహా‌లో టాక్ షో చేస్తున్నాను.. మాకు, అల్లు కుటుంబంతో బంధం గురించి అప్పుడే చెప్పాను. బాబుకు నా ఆశీస్సులు. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. నలుమూలల నుంచి విచ్చేసిన అభిమానులకు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రోడ్యూసర్లకు, మీడియాకు అందరికి థాంక్స్. ఇది ఏ ఒక్కరి సినిమా అని అనుకోవడం లేదు. అందరికి శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలి. మనం పలికే అక్షరంలో ఉండే బలం.. ఒక్కో అక్షరం కలిపితే మంత్రం అవుతుంది. ఆహాలో చేసినట్టుగానే.. ఓ భక్తి చానల్‌ కూడా మొదలుపెడదామని అనుకుంటున్నాం. వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, నమస్కరించుట, పరిచరియాలు చేయూట, స్నేహ భావంతో ఉండుట, మనో వాక్కాయాలను భగవంతుడికి అర్పించుట.. ఇదే అఖండ సినిమా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు సినిమా గురించి. ఆది దేవుడు ఆశీర్వాదం ఉంది. భారతదేశంలో ఉన్న భక్తిని.. అఖండ సినిమాతో ఇంకా బతికిస్తునందుకు ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు మన కళ్ల ముందు కనిపించే దేవుళ్లు.. వాళ్లు దేవుళ్ల కన్నా ఎక్కువ. నేను ఎక్కువగా ప్రేమించేది నాన్న గారిని. ఆయన నాకు గురువు, దేవుడు. ఆ తర్వాత నేను ప్రేమించేది నా అభిమానులను. విజయాలకు గర్వపడటం.. అపజయాలకు కుంగిపోం. అభిమానుల ఆశీస్సుల పొందగలుగుతున్నామంటే అది పూర్వ జన్మ సుకృతం. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ ‌కు హాట్సఫ్. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. ఇద్దరు తమ్ముళ్లు.. అల్లు అర్జున్, శ్రీకాంత్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. కరోనా కాలంలో కూడా ప్రాణాలను తెగించి షూటింగ్‌లు చేశాం. చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. పుష్ప, రాజమౌళి గారి రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. వాటికి రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి. మలయాళంలో బన్నీకి చాక్లెట్ బాయ్ అని పేరిచ్చారు. సినిమాకు భాష బేధం లేదు. మంచి సినిమాలు అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. అభిమానులు క్షేమంగా ఇళ్లకు చేరండి. ప్రజా సేవ చేస్తున్న నా అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉంటుంది’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు