జై బాలయ్య ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇదిగో…!

January 10, 2022

జై బాలయ్య ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇదిగో…!

Jai balayya Full Video song: న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను హ్యాట్రిక్ మూవీ అఖండ ఎంత‌టి ఘ‌న‌మైన విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే… ఈ సినిమాలోని మాస్‌ ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఈ చిత్రంలోని ‘జై బాలయ్య’ సాంగ్‌ కూడా బాలయ్య ఫ్యాన్స్‌ను ఊపేసింది. ఇప్పుడీ సాంగ్‌ ఫుల్‌ వీడియో విడుదలైంది. కుడిచేతికి గాయమైన చిత్రంయూనిట్‌కు ఇబ్బంది కలగకూడదని చేయి ఎంతో నొప్పిగా ఉన్నా, భరించి ‘జై బాలయ్య’ పాటలో బాలకృష్ణ అదరగొట్టారని ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. ఇక అఖండ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందించిన విషయం తెలిసిందే. మరోవైపు ‘అఖండ’ చిత్రం ఈ నెల 21 నుంచి ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

ట్రెండింగ్ వార్తలు