‘అఖండ’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?
November 21, 2021
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న`అఖండ` డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించనున్నారట. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇక బాలకృష్ణ అఘోర అవతారం సెకండాఫ్‌లో రానుందట. అఘోరాగా బాలకృష్ణ ఉగ్రరూపం చూపించారని చెబుతోంది చిత్ర యూనిట్. అలాగే శ్రీకాంత్, జగపతి బాబు పాత్రలు కూడా ప్రేక్షకులకి నచ్చుతాయి అని తెలిపారు. తమన్ మ్యూజిక్, ద్వారక క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజర్ అసెట్స్ చిత్ర బృందం తెలిపింది.ఇటీవల విడుదలచేసిన ట్రైలర్‌కి విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే…