March 29, 2024
పుష్ప సినిమా విడుదల తర్వాత బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మరొక అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. దుబాయ్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువు తీరింది.
అల్లు అర్జున్ స్వయంగా దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం కి వెళ్లి తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేడం టుస్సాడ్స్ లో నేడు మైనపు విగ్రహ ఆవిష్కరణ, ప్రతి కళాకారుడికి ఇదో గొప్ప మైలురాయి, ధన్యవాదాలు అనే క్యాప్షన్ తో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మైనపు విగ్రహం అలవైకుంఠపురం సినిమాలో బన్నీ ఐకానిక్ స్టైల్ తరహాలో ఏర్పాటు చేశారు.
మైనపు విగ్రహం పర్ఫెక్ట్ గా రావటం కోసం 200 రకాల మెజర్మెంట్స్ ను అల్లు అర్జున్ నుంచి సేకరించారు, తన డాన్స్ మూమెంట్స్ ని కూడా సేకరించడం జరిగిందని మేడం టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మేనేజర్ అయిన సనాజ్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి విగ్రహం వెనుక ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. ఈ సందర్భంగా బన్నీ ఒక ఎమోషనల్ స్వీట్ చేశారు. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.
నా మొదటి సినిమా గంగోత్రి 2003లో ఇదే రోజున విడుదలైంది. ఇప్పుడు ఇదే రోజు( మార్చ్ 28 ) నా మైనపు విగ్రహాన్ని దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నాను. నా ఈ 21 సంవత్సరాల సినీ కెరియర్ ఒక మరుపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడను, రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలాగా చేయాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Read More: Tillu Square Movie Review Telugu: టిల్లు స్క్వేర్ రివ్యూ అండ్ రేటింగ్.. టిల్లన్న మ్యాజిక్ రిపీట్!