April 8, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈయన హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో శర వేగంగా ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా ద్వారా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇటీవల ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ చేతుల మీదగా ప్రారంభించారు అయితే తాజాగా ఈ విగ్రహం గురించి అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఒకరోజు నేను ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ అందరూ లేచి నిలబడి నన్ను చూస్తూ నవ్వుతున్నారు ఏం జరిగిందని నేను ఆలోచిస్తూ ఉండగా ఒక వ్యక్తి ఒక లెటర్ తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టారని తెలిపారు.
ఆ లెటర్ నేను పూర్తిగా కూడా చదవలేదు పైన మేడం టుస్సాడ్స్ అని మాత్రమే కనిపించిందని అది చూడగానే సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఇక నా మైనపు విగ్రహాన్ని చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నట్టు ఉందని బన్నీ తెలియజేసారు. ఈ విగ్రహాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు హెయిర్ పార్ట్ చాలా అద్భుతంగా ఉందని నాకు ఎంతో నచ్చినటువంటి ఫోజులలో తగ్గేదేలే ఫోజు చాలా బాగా నచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మేడం టు స్సాడ్స్ వచ్చి తన మైనపు విగ్రహాన్ని చూడాలి అంటూ ఈయన పిలుపునిచ్చారు.
Read More: ఫ్యామిలీ స్టార్ కోసం ఏకంగా అలాంటి పని చేసిన దిల్ రాజు.. డబ్బు కోసం ఏమైనా చేస్తారా అంటూ?