ఆ ప్రమోషన్స్‌లో.. అల్లు అర్జున్‌ తగ్గేదేలే!

August 25, 2022

ఆ ప్రమోషన్స్‌లో.. అల్లు అర్జున్‌ తగ్గేదేలే!

సుకుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌కు మంచి మైలేజ్‌ను ఇచ్చినమాట వాస్తవం. అయితే ఈ ఒక్క సినిమాతోనే అల్లు అర్జున్‌ ఏదో ఇంటర్‌నేషనల్‌ స్టార్‌ అయ్యారన్నట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు ఓ వ‌ర్గం వారు. వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ అల్లు అర్జున్‌ ఆ బ్రాండ్‌ను రిజెక్ట్‌ చేశారు? పదికోట్ల ఈ బ్రాండ్‌ను రిజెక్ట్‌ చేశారని అల్లు అర్జున్ పీఆర్‌ టీమ్‌ పెయిడ్‌ ట్వీట్స్‌తో సోషల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంటారు. అయితే ఈ పిచ్చి ఇప్పుడు పీక్స్‌ చేరింది. ఏకంగా హాలీవుడ్‌ లీడ్‌ యాక్టర్‌ అంటూ లేని పోని ప్రమోషన్‌ యాక్ట్‌విటీస్‌ చేస్తున్నారు అల్లు అర్జున్‌ కాంపౌడ్‌ వర్గీయులు.

నిజానికి అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఓ సారి మాత్రం సంజయ్‌లీలా భన్సాలీతో మీటింగ్‌ జరిగింది. అంత మాత్రాన సినిమా అనుకోలేం. గతంలో రామ్‌చరణ్, రీసెంట్‌గా నాగచైతన్య కూడా భన్సాలీ ఆఫీస్‌కి వెళ్లొచ్చారని తెలిసింది. కానీ పెద్దగా ప్రచారం సాగలేదు. కానీ అల్లు అర్జున్‌ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఇప్పుడు హాలీవుడ్‌ చాన్స్‌ అంటున్నారు. ఆగస్టు 25న ఓ ఇంగ్లీష్‌ పేపర్‌లో అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌ ఆఫర్ల వెల్లువ, 2026 వరకు డేట్స్‌ ఖాళీగా లేవు అని ఓ వార్త అచ్చు అయ్యింది. ఈ న్యూస్‌ను బేస్‌చేసుకుని మరికొందరు మరికొన్ని వార్తలు వండీ వర్చారు. మంచి ప్రమోషన్‌ మైలేజ్‌ వచ్చింది. సాయంత్రానికి హాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ అంటూ మరో వార్త. రీసెంట్‌గా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికాలోని ఓ పేరెడ్‌లో పాల్గొన్నారు అల్లు అర్జున్‌. గౌరవప్రదంగా అక్కడి మేయర్‌ సన్మానించారు. కానీ పనిలో పనిగా అల్లు అర్జున్‌ ఓ హాలీవుడ్‌ డైరెక్టర్‌ని కలిశారని వార్తలు రాయడం మాత్రం గొప్ప విడ్డూరం. పెయిడ్‌ ప్రమోషన్స్‌లో మాత్రం అల్లు అర్జున్‌ ‘తగ్గేదేలే’ అన్నట్లు చేస్తున్నారు ఆయన పీఆర్‌ టీమ్‌. ఇదంతా..అల్లు అర్జున్‌ మార్కెట్‌ పెంపుదల కార్యక్రమంలో భాగంగా జరిగే ప్రక్రియ అని సగటు సినిమా లవర్‌కు తెలుసు. నిజంగా అల్లు అర్జున్‌ ఓ హాలీవుడ్‌ దర్శకుడిని మీట్‌ అయితే ఆనందమే. ఒకవేళ అలా జరిగి ఉంటే అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేసేవారు కదా. అని కొందరు నెటిజన్లు, ఇతర హీరోల ఫ్యాన్స్‌ అంటున్నారు…అది కూడా నిజ‌మేగా మ‌రి.

ట్రెండింగ్ వార్తలు