August 30, 2022
ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్స్ సెట్ కావడం, అప్పుడప్పుడు అవి క్యాన్సిల్ కావడం తరచూ జరుగుతూనే ఉంటా యి. కానీ రీసెంట్ టైమ్స్‌లో మెగా హీరోలు తమ నెక్ట్స్ సినిమాల విషయంలో క్యాన్సిల్‌కే ఎక్కువ ఓటు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఛలో’, ‘భీష్మ’ వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు వెంకీ కుడుములతో చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అయ్యారు. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత. కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే చాన్సెస్ కనిపించడం లేదిప్పుడు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ కూడా రాక పోవడం అనేది ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లే అన్న సంకేతాలను ఇస్తుందన్నది ఇండస్ట్రీ టాక్.
‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్‌తో పవన్‌కళ్యాణ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. పవన్‌తో సినిమాను వదులుకుని మరో ప్రాజెక్ట్‌పైకి షిప్ట్ అయ్యేందుకు హరీష్ శంకర్ కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను కాదని పవన్ ‘భీమ్లానాయక్’ (మలయాళం హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్) ఆల్రెడీ చేశారు. సినిమా కూడా రిలీజైంది. ఇప్పుడు మళ్లీ తమిళ హిట్ ‘వినోదాయ చిత్తమ్’(తెలుగులో ‘వినోదహితం’) అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఇలా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను పక్కనపెట్టిన పవన్ వైఖరి ఏంటి? అనేది ఇండస్ట్రీ వర్గాలు ఆలోచిస్తున్నాయి.
అల్లు అర్జున్– కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందాల్సింది. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే క్యాన్సిల్ అయ్యింది. అలాగే ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్‌సీఏ’ సినిమాలను తీసిన వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుట లేదు’ అనే సినిమాను ప్రకటించారు. కానీ ఈ సినిమాను స్టార్ట్ చేయకుండానే సుకుమార్‌తో ‘పుష్ప’ తీసి బంపర్‌హిట్ కొట్టారు అల్లు అర్జున్. పుష్ప ఇచ్చిన ప్యాన్ ఇండియా క్రేజ్‌తో మళ్లీ వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ సినిమా చేసే చాన్సెస్ ఉన్నట్లు కనిపించడం లేదు.
తెలుగులో వచ్చిన నాని ‘జెర్సీ’ సినిమాతో మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ హిట్ తర్వాత యూవీ క్రియేషన్స్‌లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు రామ్‌చరణ్. కానీ ఇప్పుడు ఈ సినిమాపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే..జెర్సీ సినిమాను హిందీలో షాహిద్‌కపూర్‌తో రీమేక్ చేశారు గౌతమ్ తిన్ననూరి. హిందీ జెర్సీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆల్రెడీ ‘ఆచార్య’ సినిమాతో ఓ ప్లాఫ్‌ను ఖాతాలో వేసుకున్న రామ్‌చరణ్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందకు ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్ ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. వచ్చే సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
అలాగే వరుణ్‌తేజ్ చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘గని’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ప్రవీణ్ సత్తారుతో వరుణ్‌తేజ్ కమిటైన సినిమా కూడా యాక్షన్ ఫిల్మ్‌యే. దీంతో వెంటనే యాక్షన్ ఫిల్మ్ అవసరమా? అనే ఆలోచనలో ఉన్నారట వరుణ్ తేజ్